విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్.. 30 ఏళ్ల మెమోరీస్ ను షేర్ చేసుకుంటూ..
సపోర్టింగ్ పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగిన తీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన స్టార్ గా ఎదగడానికి ఎంతో కష్టపడ్డారు. తన టాలెంట్ ను, ప్రేక్షకులపై ప్రేమ, సినిమాపై ప్యాషన్ తో మరింత ఎత్తుకు ఎదుగుతున్నారు. ప్రస్తుతం సోషల్ గా కూడా పలు అవెర్ నెస్ ప్రోగ్సామ్స్, ఈవెంట్లకు హాజరవుతూ తనవంతు స్ఫూర్తిదాయకమైన మాటలు చెబుతున్నారు. మరోవైపు తను కూడా కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి పంచుకున్న ఓ వీడియోతో కుటుంబంపై, ముఖ్యంగా తమ్ముడు ఆనంద్ దేవరకొండపై ఎంత ప్రేమనో తెలియజేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
తమ్ముడిని హీరోగా నిలబెట్టి..
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎంతటి కాంపీటేషన్ ఉందో తెలిసిందే. ఇతర ఇండస్ట్రీలో పోల్చితే కలర్ ఫుల్ వరల్డ్ సినీ ఇండస్ట్రీలో పోటీ ఎక్కువగానే ఉంటుంది. లక్షలో ఒక్కరు షైన్ అవుతారు. అలా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి అనే చిత్రంతో టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ ఎదగడమే కాకుండా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను కూడా హీరోగా మార్చేశాడు. ఆనంద్ దేవరకొండ కెరీయర్ కు అన్ని విధాలుగా సహకరిస్తూ అండగా నిలుస్తున్నాడు.

ఆనంద్ దేవరకొండపై విజయ్ లవ్..
విజయ్ దేవరకొండకు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ అంటే ఇష్టమనే విషయాన్ని పలు సందర్భాల్లో చూశాం. కానీ 30 ఏళ్లుగా చిన్నప్పటి నుంచి తమ్ముడితో కలిసి ఆడుకున్న, పాడుకున్న, చదువుకున్న, అల్లరి పనులు చేసిన వీడియోలు, ఫొటోలతో కలిసి విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. ఆనంద్ దేవరకొండపై తనకు ఉన్న ప్రేమను అభిమానులతో ఇలా పంచుకున్నారు. వారి బాండింగ్ ను చూసి అభిమానులు, నెటిజన్లు కూడా సంతోషిస్తున్నారు.
ప్రమోషన్స్ లో దిట్ట..
తన సినిమాలను విజయ్ దేవరకొండ ఎలా ప్రమోట్ చేసుకుంటారో తెలిసిందే. చిన్న సినిమా అయినా తన స్పీచ్ తో హైప్ తెప్పిచ్చేస్తాడు. ఇక త్వరలో విడుదల కాబోతున్న కింగ్డమ్ విషయంలో మాత్రం తనకు ఫీవర్ రావడం వల్ల కాస్తా ఆలస్యంగా ఎంట్రీ ఇస్తున్నారు. అయినప్పటికీ ఇలా అన్నదమ్ముల బాండింగ్ ను తెలియజేసే వీడియోను పంచుకుంటూ.. దానికి కింగ్డమ్ చిత్రంలోని అన్నా అంటేనే సాంగ్ ను జతచేసి తన సినిమాపై బజ్ ను క్రియేట్ చేశారు.
కింగ్డమ్ సినిమా వివరాలు..
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం కింగ్డమ్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందిస్తుండటం విశేషం. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











