క్యూట్ ఫ్రెండ్‌తో అర్ధనగ్నంగా విజయ్ దేవరకొండ.. ముద్దుగా ప్రేమను పంచుతూ.. ఫోటో వైరల్

సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ లాక్‌డౌన్‌లో ఫ్యామిలీ లైఫ్‌నే కాకుండా సోషల్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబంతో ఫీల్‌గుడ్ అనుభూతులను షేర్ చేసుకొంటూ సామాజిక బాధ్యతగా కరోనావైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన ఇన్స్‌టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటో వైరల్‌గా మారింది. ఆ ఫోటో కథ ఏమిటంటే..

ప్లాస్మా డోనర్స్‌కు ప్రశంసలు

ప్లాస్మా డోనర్స్‌కు ప్రశంసలు

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో పోలీసులతో కలిసి పలు సామాజిక కార్యక్రమాలను విజయ్ దేవరకొండ నిర్వహిస్తున్నారు. ఇటీవల కరోనాను జయించిన పేషంట్స్‌కు ప్లాస్మా డొనేట్ చేసిన దాతలకు విజయ్ దేవరకొండ,సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసీ లో సన్మానించారు. ఈ సందర్భంగా ప్లాస్మా డోనర్స్ పోస్టర్ ఆవిష్కరణలో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఒకవేళ నాకు కారోనా వస్తే తప్పకుండా ప్లాస్మా దానం చేస్తా అని ఈ సందర్భంగా అన్నారు.

హైదరాబాద్ సిటీ పోలీసులతో కలిసి

హైదరాబాద్ సిటీ పోలీసులతో కలిసి

కరోనా నుంచి బయటపడిన ఓ వ్యక్తి 500 ఎంఎల్ ప్లాస్మా దానం చేస్తే ఇద్దరు కోవిడ్ పేషేంట్లను కాపాడ వచ్చు. హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వందల మంది పాల్గొని మరో వందల మందిని బతికించే ప్రయత్నం చేయడం అభినందనీయం. ప్లాస్మా దాతలు దేవుడితో సమానం, donateplasma.scsc.in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వడం ద్వారా ప్లాస్మా దానం చేయవచ్చు అంటూ దాతలపై విజయ్ దేవరకొండ ప్రశంసల వర్షం కురిపించారు.

తల్లిదండ్రులతో కలిసి

తల్లిదండ్రులతో కలిసి

కరోనా సమయంలో అందరి మాదిరిగానే విజయ్ దేవరకొండ ఇంటికే పరిమితమయ్యారు. తల్లిదండ్రులతో కలిసి ఆటపాటల్లో నిమగ్నమయ్యాడు. తల్లితో గేమ్స్ ఆడుతూ.. తండ్రితో ప్రేమను పంచుకొంటున్న ఫోటోలను ఇటీవల విజయ్ దేవరకొండ షేర్ చేశారు.

తన పెంపుడు కుక్కతో అప్యాయంగా

తన పెంపుడు కుక్కతో అప్యాయంగా

ఇక తనకు ఇష్టమైన పెంపుడు కుక్కలతో విజయ్ దేవరకొండ ఆడుతూ కనిపించారు. లాక్‌డౌన్‌లో తన క్యూటీ ఫ్రెండ్‌ను మెడపైకి ఎక్కించుకొని ప్రేమను పంచుతూ కనిపించారు. ఇది నా చిచ్చరపిడుగు అంటూ తన పెంపుడు కుక్కను అభిమానులకు పరిచయం చేశారు. ఆ ఫోటోను దాదాపు 20 లక్షల మందికిపైగా లైక్ చేశారు.

Recommended Video

Happy Birthday Vijay : Thalapathy Vijay Box Office Career
మై క్యూట్ బీస్ట్ అంటూ లవ్లీ ఫోటో

మై క్యూట్ బీస్ట్ అంటూ లవ్లీ ఫోటో

ఇక తాజాగా మరోసారి తన పెంపుడు కుక్కను ఒడిలో పెట్టుకొని ఫోజిచ్చారు. అర్జున్ రెడ్డిలో మాదిరిగా అర్ధనగ్నంగా కనిపిస్తున్న ఫోటోను తన ఇన్స్‌గ్రామ్‌లో పోస్టు చేశారు. మై క్యూట్ బీస్ట్ అంటూ కామెంట్ చేశారు. ఈ ఫోటోకు విశేషమైన లైక్స్ లభించాయి. ఆ ఫోటోపై స్పందిస్తూ మోస్ట్ హాండ్‌సమ్ హీరో, ఈ ఫోటోతో మరోసారి లవ్‌లో పెడ్డాను. నా వాల్ పేపర్ మీద పెట్టుకొంటాను. క్యూటీ బీస్ట్ కంటే నీవే క్యూట్‌గా ఉన్నావంటూ అభిమానులు కామెంట్లు కురిపించారు. ఇప్పటికే 18 లక్షలకుపైగా లైక్ రావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X