Vijay Deverakonda: అలా నేనేప్పటికీ చేయను.. బన్నీ గురించి విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే. అద్భుతమైన నటనతో అదిరిపోయే చిత్రాలు చేసే ఈయన తాజాగా ఎవరూ ఊహించని పాత్రలో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా అసలైన ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించి అందరినీ ఆకట్టుకోబోతున్నాడు. అయితే ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు. అల్లు అర్జున్ గురించి మాట్లాడారు. అలా తానెప్పటికీ చేయనంటూ క్లారిటీ ఇచ్చాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పరుశురాం డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న తాజా సినిమానే ఫ్యామిలీ స్టార్. అయితే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, వాసువర్మ, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే విజయ్ సరసన మృణాల్ థాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్, పోస్టర్లు, పాటలు, ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది.

Vijay Deverakonda Shocking Comments on Allu Arjun Dance Check Details

ఇప్పటికే సినిమాపై భారీ బజ్ ఏర్పడగా.. తమ చిత్రాన్ని మరింత ప్రమోట్ చేసుకుంటున్నారు చిత్రబృందం. హీరోహీరోయిన్లతో పాటు దర్శక, నిర్మాతలు కూడా గ్రూపుగా ఓసారి, సెపరేట్ గా ఓసారి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే తాజాగా హీరో విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈక్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తాను తొలిసారి అల్లు అర్జున్ ను డాడీ సినిమాలో చూశానని అన్నాడు.

అల్లు అర్జున్ టీనేజ్ లో ఉండగా.. డాడీ సినిమాలో ఓ చిన్న రోల్ లో కనిపించాడని, అక్కడ అదిరిపోయే డ్యాన్స్ చేయగా తాను షాక్ అయినట్లు చెప్పాడు. తనకు డ్యాన్స్ అస్సలే రాదని.. చాలా కష్టంగా చేస్తానని విజయ్ దేవరకొండ వివరించాడు. తనకు డ్యాన్స్ చేయాలని అనగానే.. లోపల ఏదో భయం, నిరుత్సాహం వంటివి మొదలవుతాయని.. కానీ సినిమాల్లో కాబట్టి చేయకతప్పదని వెల్లడించాడు. తనకు అల్లు అర్జున్ డ్యాన్స్ అన్నా.. ఆయన గ్రేస్ అన్నా చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు.

Vijay Deverakonda Shocking Comments on Allu Arjun Dance Check Details

అల్లు అర్జున్ లా తాను ఎప్పటికీ డ్యాన్స్ చేయలేనని.. కనీసం ఆ ఊహ కూడా తనకు రాదంటూ వెల్లడించాడు. అల్లు అర్జున్ డ్యాన్స్ లో మంచి గ్రేస్ ఉంటుందని.. చాలా ఎనర్జిటిక్ గా అదిరిపోయే స్టెప్పులు వేస్తారని వెల్లడించారు. అలాగే తనకు విజయ్ దళపతి డ్యాన్స్ అంటే కాడా చాలా ఇష్టం అని ఆ స్టైల్, స్వాగ్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుందని వివరించాడు. తాను వీళ్ల ఇద్దరిలా డ్యాన్స్ ఎప్పటికీ చేయలేనని.. కానీ చేయాలని ఉంటుందని స్పష్టం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X