Don't Miss!
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- News జగన్ Vs పవన్, సమర్ధతకు పరీక్ష - దక్కేదెవరికి..!!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
ఎన్టీఆర్.. కల్యాణ్.. రామ్ తర్వాత విజయ్ దేవరకొండే.. ప్లాన్ చేస్తున్న బడా డైరెక్టర్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' హిట్‌తో ఊపుమీదున్న పూరీ జగన్నాథ్ - 'డియర్ కామ్రేడ్' ఫలితంతో ఢీలా పడిన విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అప్పుడే ఊహాగానాలు, అంచనాలు ప్రారంభమయ్యాయి. అలాగే, ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్లో హల్చల్ చేస్తోంది.
క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు 'ఫైటర్' అనే టైటిల్ పెట్టబోతున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ కూడా చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు అక్టోబర్‌లో జరగనున్నాయని, ఆ తర్వాత అంటే జనవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమాలో నటిస్తున్న విజయ్.. అది పూర్తయిన వెంటనే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోడానికి 'థాయ్‌లాండ్' వెళ్తాడని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మార్షల్ ఆర్ట్స్ బ్యాగ్ డ్రాప్లోనే నడుస్తుందట. అందుకే దీనికి 'ఫైటర్' అనే పేరు పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ లోపు పూరీ స్క్రిప్టు వర్క్ పూర్తి చేస్తాడని టాక్ వినిపిస్తోంది.
ఇక, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడని తెలుస్తోంది. అందుకోసమే అతడు షూటింగ్ ప్రారంభించడానికి సమయం కావాలని కోరాడని టాక్. పూరీ జగన్నాథ్ గతంలో టెంపర్ సినిమాలో తారక్, ఇజం కోసం కల్యాణ్ రామ్, ఇస్మార్ట్ శంకర్‌లో రామ్‌ను సిక్స్ ప్యాక్‌తో చూపించాడు. ఇప్పుడు విజయ్ కూడా వారి బాటలోనే నడుస్తున్నాడని అంటున్నారు. ఇదే జరిగితే క్రేజీ హీరో ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.