నా మైండ్‌ అంతా అదోలా.. ప్రతీచోట ఏడుస్తున్నాను.. రష్మికను చూస్తే.. విజయ్ దేవరకొండ

గీతా గోవిందం, టాక్సీవాలా భారీ విజయాల తర్వాత విజయ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో రిలీజైంది. భరత్ కమ్మ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రంలో బాబీ, లిల్లీ అనే ప్రేమ జంట జీవన ప్రయాణం నేపథ్యంగా డియర్ కామ్రేడ్ తెరకెక్కింది. ఈ సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న సమయంలో శనివారం చిత్ర యూనిట్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఎమోషనల్‌గా మాట్లాడుతూ..

డియర్ కామ్రేడ్ చాలా స్పెషల్

డియర్ కామ్రేడ్ చాలా స్పెషల్

డియర్ కామ్రేడ్ రిలీజైన దగ్గర నుంచి నా మైండ్‌లో చాలా నడుస్తున్నాయి. నేను మాట్లాడేటప్పుడు ఏవీ బయటకు వస్తాయో చూడాలి. డియర్ కామ్రేడ్ సినిమా నాకు చాలా స్పెషల్. ప్రమోషన్ చేపట్టినప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను. నా మనసుకు దగ్గరైన సినిమా. గత రెండేళ్ల నుంచి ఈ కథతో ట్రావెల్ అవుతున్నాను అని విజయ దేవరకొండ అన్నారు.

 చాలా ఎమోషనల్‌గా మారాను

చాలా ఎమోషనల్‌గా మారాను

డియర్ కామ్రేడ్ సినిమా కంటెంట్, బాబీ, లిల్లీ క్యారెక్టర్ల జర్నీ, వారికి ఉండే రిలేషన్ షిప్, వారి గోల్స్ కోసం కష్టాలు, సుఖాలు నన్ను ఎంతో ఆకట్టుకొన్నాయి. ఈ సినిమా చేస్తూ నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను. నా తమ్ముడి ఫంక్షన్లో కూడా ఏడ్చేశాను. ఈ సినిమా లో నటిస్తున్నప్పటి నుంచి ఎమోషనల్‌గా మారాను. అందరూ ఎందుకలా ఏడుస్తున్నావు అని విజయ్ పేర్కొన్నారు.

 డియర్ కామ్రేడ్ బిగ్గెస్ట్ హిట్

డియర్ కామ్రేడ్ బిగ్గెస్ట్ హిట్

డియర్ కామ్రేడ్ సినిమా బిగ్గెస్ట్ హిట్ అంటున్నారు. నాకు కలెక్షన్ల గురించి అసలే తెలియదు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా సినిమాను అంత మంది చూశారా? తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ రంగాల్లో ఎంతో మంది ఆదరణ చూపిస్తున్నారు. అందుకు నాకు గర్వంగా ఉంది. నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ చేసినందున్న.. నా బాధ్యతగా సినిమాను గట్టిగా ప్రమోషన్ చేశాను అని విజయ్ దేవరకొండ అన్నారు.

 మ్యూజిక్ నాకు ఫేవరేట్‌గా

మ్యూజిక్ నాకు ఫేవరేట్‌గా

డియర్ కామ్రేడ్ సినిమా పాటలు, మాటలు నాకు చాలా దగ్గరయ్యాయి. అవన్నీ నాకు ఫేవరేట్. ఈ సినిమా ప్రమోషన్లో నా కామ్రేడ్స్‌కు అంకింతం ఇస్తున్నాను చెప్పాను. దర్శకుడు భరత్ కమ్మకు అంకింతం. ఇలాంటి సినిమా తీసినందుకు భరత్ తండ్రి హ్యాపీగా ఫీలవుతాడు. కచ్చితంగా గర్వపడుతాడు అని విజయ్ వెల్లడించారు. నీలాంటి స్వచ్ఛమైన మనిషిని కలిసినందుకు సంతోషంగా ఉన్నారన్నారు.

 రష్మిక మందనకు థ్యాంక్స్ చెప్పాలి

రష్మిక మందనకు థ్యాంక్స్ చెప్పాలి

డియర్ కామ్రేడ్ విషయంలో నేను రష్మిక మందనకు థ్యాంక్స్ చెప్పాలి. ఆమెను చూస్తే గర్వంగా ఉంది. లిల్లీగా అద్భుతంగా నటించింది. ఈ సినిమా కథను ఇలానే చెప్పాలని అనుకొన్నాం. సినిమా స్లోగా ఉందని అన్నారు. థియేటర్లలో చాలా మంది రెస్పాన్స్ చూశాను. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి మంచి రివ్యూలు వచ్చాయి. సినిమా గురించి అన్ని కోణాల్లో రాశారు. ఫస్టాఫ్ రొమాంటిక్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలో నటించినందుకు సూపర్ హ్యాపీ అని విజయ్ దేవరకొండ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X