మూడ్ దొబ్బేసింది, మాతో ఇలాంటి పనులు చేయిస్తారా?: విజయ్ దేవరకొండ

By Bojja Kumar

Recommended Video

Vijay Deverakonda Speech @Geetha Govindam Pre Release Event

విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మందన్న జంట‌గా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం " గీత గోవిందం". బ‌న్నివాసు నిర్మాతగా అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్లో ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్టు 15న మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ వైజాగ్‌లో ఆదివారం గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ప్రసంగం ఆకట్టుకుంది. పైరసీ మూలంగా రెండు మూడు రోజులుగా తన మూడ్ బాగోలేదని తెలిపారు.

మూడ్ మొత్తం దొబ్బేసింది

మూడ్ మొత్తం దొబ్బేసింది

రెండు మూడు రోజుల నుండి మూడ్ మొత్తం దొబ్బేసింది. సడెన్లీ ఎనర్జీ పోయినట్లయింది. అరవింద్ గారు, వాసుగారు, మా టీం అంతా స్మైల్ చేస్తూ కనిపించినా వారు ఎంత కష్టాలు పడుతున్నారో నాకు తెలుసు.... అని విజయ్ అన్నారు.

మాతో ఇలాంటి పనులు చేయిస్తారా?

మాతో ఇలాంటి పనులు చేయిస్తారా?

ఇక్కడ కూర్చుని నా ఫంక్షన్ నేను ఎంజాయ్ చేయకుండా లింకులు పంపిస్తున్నాను. మేము యాక్టర్లం... మమ్మల్ని సినిమాలు చేయనివ్వాలి కానీ ఇలాంటి పనులు చేసేలా చేయొద్దు. ఈ ఆడిటోరియం లోపలికి వచ్చినపుడు మీ అందరి అరుపులు, ఎనర్జీ చూస్తుంటే మళ్లీ నాలో ఉత్సాహం వచ్చినట్లయింది. ఇదంతా చూసిన తర్వాత మనమెందుకు ఫీల్ అవ్వాలి? మనమెందుకు ఎఫెక్ట్ అవ్వాలి? అనుకున్నాను.

చిన్నప్పటి నుండి పోరాటమే

చిన్నప్పటి నుండి పోరాటమే

మనం చిన్నప్పటి నుండి వివిధ దశల నుండి పోరాటం చేస్తూ ఎదిగాం. సర్వైవల్ గురించి, రెస్పెక్ట్ గురించి... ఇలా ప్రతి విషయంలో పోరాడుతూనే వచ్చాం. లైఫ్ మనకు నేర్పించింది అదే. ఎలాంటి పరిస్థితి ఎదురైనా పోరాడి గెలవడం నేర్చుకున్నాం... ఇపుడు నేను చేస్తుంది అదే అని విజయ్ అన్నారు.

కావాలని మమ్మల్ని కిందకు లాగుతున్నారు

కావాలని మమ్మల్ని కిందకు లాగుతున్నారు

ఓ వైపు పైరసీ జరుగుతుంటే... కొందరు మేము పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నాంటూ మమ్మల్ని కిందకు లాగుతున్నారు. వారికి ఒకటే చెబుతున్నాను. నేను ఎలాగైనా నాకు కావాల్సింది సాధిస్తాను. నాకు వచ్చింది ఇదే, సాధిస్తాను అనే నమ్మకం ఉంది అన్నారు

థియేటర్ నవ్వులతో నిండి పోతుంది

థియేటర్ నవ్వులతో నిండి పోతుంది

మనం డల్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఎనర్జీతో ఉందాం. సినిమా విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఆగస్టు 15న థియేటర్లోకి వస్తోంది. నేను థియేటర్‌లోకి సంవత్సరం తర్వాత వస్తున్నాను. థియేటర్లో సినిమా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. నాకు గట్టి నమ్మకం ఉంది. నవ్వులతో థియేటర్ నిండి పోతుంది. పైరసీ గురించి చెప్పి కూడా వేస్ట్. ఏది కరెక్టో.... ఏది రాంగో మీకు కూడా తెలుసు.

ఎవరు ఏమన్నా పడతాను

ఎవరు ఏమన్నా పడతాను

ఎవరు ఏమన్నా పడతాను. ఎందుకంటే నేను నచ్చిన పని చేస్తున్నాను. కాకపోతే ఇలాంటివి జరుగడం కాస్త బాధ అనిపించింది. సినిమా విడుదల తర్వాత సంతోషంతో ఎనర్జీ మళ్లీ వస్తుందనే నమ్మకం ఉందని విజయ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X