తమిళ బిగ్‌బాస్‌లో విజయ్ దేవరకొండ.. కమల్ హాసన్ కలిసి.. టైటిల్ విజేత ఎవరో..

తమిళ బిగ్‌బాస్ 2 హుషారుగా సాగుతూ ముగింపు దశకు వచ్చేసింది. కమల్ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం విశేష ఆదరణను మూటగట్టుకొంటుంది. సెన్సేషనల్ సంఘటనలు, హాట్ హాట్ టాపిక్స్ ముందుకెళ్తున్నది. ఇలాంటి బిగ్‌బాస్ ఇంటిలో రౌడీ విజయ్ దేవరకొండ ప్రత్యక్షమయ్యాడు. తమిళ బిగ్‌బాస్‌లో తన నోటా చిత్రాన్ని ప్రమోట్ చేసుకొనేందుకు వెళ్లి విలక్షణ నటుడు కమల్ హాసన్‌ను కలుసుకొన్నాడు.

 నోటా ప్రమోషన్ కోసం

నోటా ప్రమోషన్ కోసం

నోటా ప్రమోషన్ కోసం తమిళ బిగ్‌బాస్‌లోకి వెళ్లిన విజయ్ దేవరకొండను హోస్ట్ కమల్ హాసన్ సాదారంగా ఆహ్వానించారు. విజయ్ దేవరకొండ నటనపై ఈ సందర్భంగా ప్రశంసల కురిపించినట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ రెడ్డి చిత్రంలో నటన ఆకట్టుకొన్నదని తెలిపినట్టు తెలిసింది.

విజయ్‌కు కమల్ విషెస్

విజయ్‌కు కమల్ విషెస్

తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న నోటా సినిమా కూడా విజయం సాధించాలని కమల్ ఆకాంక్షించారు. విజయ్ దేవరకొండకు మరింత మంచి పేరు తేవాలని ఆయన విషెస్ అందజేసినట్టు తెలుస్తున్నది. తమిళ బిగ్‌బాస్ టైటిల్ కోసం రిత్విక, జనని అయ్యర్, ఐశ్వర్య, విజయలక్ష్మి పోటీ పడుతున్నారు. ఆదివారం ఫైనల్ జరుగనున్నది.

 అక్టోబర్ 5న రిలీజ్

అక్టోబర్ 5న రిలీజ్

రాజకీయ నేపథ్య చిత్రంగా నోటా చిత్రం రూపొందింది. గీతా గోవిందం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నోటా వస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నది.

 సీఎం పాత్రలో విజయ్ దేవరకొండ

సీఎం పాత్రలో విజయ్ దేవరకొండ

ఇటీవల విడుదలైన నోటా చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఇటీవల విడుదలైన పాటకు కూడా యూట్యూబ్‌ రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ వారు నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ పొలిటికల్ మూవీలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రిగా కనిపిస్తారు. ఈ చిత్రానికి శంతన కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా, శామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X