షాకింగ్: సొంత తమ్ముడిని కూడా పట్టించుకోని విజయ్ దేవరకొండ.. ఫ్యాన్స్ రచ్చ

Recommended Video

Vijay Devarakonda Not Interested In Brother's Dorasani? || Filmibeat Telugu

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి అలా వచ్చి రాగానే స్టార్ హీరోలను మించి క్రెడిట్ సంపాదించాడు విజయ్. తన సినిమాలకు స్టార్ హీరోల సపోర్ట్ తీసుకొనే స్టేజ్ నుంచి అనతికాలం లోనే తానే ఇంకో హీరో సినిమాను ప్రమోట్ చేసే స్థాయికి ఎదగడం ఒక్క విజయ్ దేవరకొండకు మాత్రమే సాధ్యపడింది. సరిగ్గా ఈ తరుణంలోనే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినీ రంగప్రవేశం చేస్తుండటంతో అతనికి విజయ్ దేవరకొండ అండదండలు ఉంటాయని భావించారంతా. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా సొంత తమ్మున్నే పక్కన పెట్టేసి షాకిస్తున్నాడు ఈ రౌడీ బాయ్. వివరాల్లోకి పోతే..

రాజశేఖర్ కూతురితో దేవరకొండ బ్రదర్ రొమాన్స్

రాజశేఖర్ కూతురితో దేవరకొండ బ్రదర్ రొమాన్స్

దొరసాని అనే సినిమాతో సినీ గడప తొక్కుతున్న దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ.. ఈ సినిమాలో జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మికతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ 'దొరసాని' టీజర్ వదిలి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. దీంతో ఈ టీజర్ విషయమై విజయ్ దేవరకొండ నుంచి సపోర్టింగ్ మెసేజ్ వస్తుందని ఊహించారు ప్రేక్షకులు. కానీ అది జరగలేదు.

తమ్ముడిని గాలికొదిలి వేరొక దానిపై విజయ్ ప్రశంసలు

కాగా ఇటీవలే 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ట్రైలర్ విడుదల చేశారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు. స్వరూప్ దర్శకత్వంలో కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ చూసిన విజయ్ దేవరకొండ.. వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సూపర్ అని పొగడ్తల వర్షం గుప్పించాడు. దీంతో ఇది చూసి దేవరకొండ ఫ్యాన్స్‌లో అలజడి మొదలైంది.

విజయ్ దేవరకొండ పై విమర్శల వర్షం

విజయ్ దేవరకొండ పై విమర్శల వర్షం

తమ్ముడి సినిమా టీజర్ పై మౌనం పాటించిన విజయ్ దేవరకొండ.. వేరొకరి సినిమా ట్రైలర్ పై ప్రశంసలు గుప్పించడం దేవరకొండ ఫ్యాన్స్‌ని కలవరపెట్టింది. వెంటనే సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టేశారు. సొంత తమ్ముడిపై నీకు మమకారం లేదా? నీ క్రేజ్‌నే నమ్ముకొని సినీ రంగ ప్రవేశం చేస్తున్న నీ తమ్ముడికి నువ్వు చేసే మర్యాద ఇదేనా? అంటూ విజయ్ దేవరకొండ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

తమ్ముడే కాదు నిర్మాత కూడా.. అయినా ఈ మౌనం ఎందుకు?

తమ్ముడే కాదు నిర్మాత కూడా.. అయినా ఈ మౌనం ఎందుకు?

దొరసాని సినిమా పరంగా చూస్తే తమ్ముడి సినీ రంగప్రవేశం ఒక్కటే కాదు.. ఆ సినిమా నిర్మాత యష్ రంగినేని కూడా విజయ్ దేవరకొండ దగ్గరి బంధువు. అయినా సరే ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ ఎందుకు ఇంత మౌనంగా ఉంటున్నాడనేది టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X