twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vijay Deverakonda టాలీవుడ్ అందాల రాకుమారుడు...స్మార్ట్‌గా, సెక్సీగా.. టాలీవుడ్‌లో ఏ హీరోకు దక్కని రికార్డు!

    |

    సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ్ మరోసారి రికార్డు సృష్టించారు. హైదరాబాద్ టైమ్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించే 30 మంది మోస్ట్ డిజైరబుల్ మెన్, 2020 జాబితాలో విజయ్ దేవరకొండ టాప్‌ స్థానంలో నిలిచారు. ఇక టాలీవుడ్‌కు చెందిన యువ హీరోలకు కూడా ఈ జాబితాలో స్థానం లభించింది. విజయ్ దేవరకొండ సాధించిన రికార్డు ఏమిటి? టాలీవుడ్ హీరోలు ఎవరెవరు ఉన్నారనే విషయంలోకి వెళితే...

    ప్రతీ ఏడాది టాప్ స్మార్ట్, సెక్సీ యూత్ ఐకాన్స్

    ప్రతీ ఏడాది టాప్ స్మార్ట్, సెక్సీ యూత్ ఐకాన్స్

    టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌కు చెందిన హైదరాబాద్ టైమ్స్ విభాగం ప్రతీ ఏడాది వేసవిలో మోస్ట్ డిజైరబుల్ మెన్, 2020 జాబితాను రూపొందిస్తుంది. స్టార్ట్‌గా, సెక్సీగా, చలాకీగా ఉంటూ తమ రంగంలో అత్యంత ప్రతిభను చూపే వారిని ఈ జాబితాలో ఎంపిక చేస్తారు.

    విజయ్ దేవరకొండ వరుసగా మూడోసారి

    విజయ్ దేవరకొండ వరుసగా మూడోసారి

    హైదరాబాద్ టైమ్స్ విభాగం మోస్ట్ డిజైరబుల్ మెన్, 2020 ఎంపికలో విజయ్ దేవరకొండ వరుసగా మూడోసారి టాప్ ప్లేస్‌ను దక్కించుకొన్నారు. విజయ్ దేవరకొండ ఇలాంటి ఘనతను సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఏ హీరోకు దక్కని రికార్డును విజయ్ దేవరకొండ సొంతం చేసుకొన్నాడు.

    జాబితాలో టాలీవుడ్ హీరోలు

    జాబితాలో టాలీవుడ్ హీరోలు

    విజయ్ దేవరకొండ తర్వాత హైదరాబాద్ టైమ్స్ విభాగం మోస్ట్ డిజైరబుల్ మెన్, 2020 జాబితాలో రామ్ పోతినేని, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, నాగశౌర్య, నాగచైతన్య, సందీప్ కిషన్, నవదీప్, రానా దగ్గుబాటి, అఖిల్ సార్థక్, సుధీర్ బాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, కార్తీకేయ, అఖిల్ అక్కినేని, ఆనంద్ దేవరకొండ, విశ్వక్ సేన్; నితిన్, నాని, ఆది పినిశెట్టి, తరుణ్ భాస్కర్ ఉన్నారు.

    అతి చిన్నస్థాయి నుంచి సూపర్‌స్టార్

    అతి చిన్నస్థాయి నుంచి సూపర్‌స్టార్

    ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. టాలీవుడ్‌లో అతి చిన్న పాత్రలతో ఆలరిస్తూ.. పెళ్లిచూపులు మూవీతో మంచి గుర్తింపు పొందగా, అర్జున్ రెడ్డి చిత్రాలతో స్టార్‌డమ్ సొంతం చేసుకొన్నాడు. ఇక పాన్ ఇండియా మూవీస్‌తో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్‌లో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న హీరోగా ఓ క్రేజ్‌ను సొంతం చేసుకొన్నారు.

    Recommended Video

    Yash, Puri Jagannadh To Team Up For A Political Thriller || Filmibeat Telugu
    లైగర్‌తో ప్యాన్ ఇండియా హీరోగా

    లైగర్‌తో ప్యాన్ ఇండియా హీరోగా

    ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కరణ్ జోహర్, పూరి కనెక్ట్స్ నిర్మాతలుగా రూపొందుతున్న లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా టీ సిరిస్ మూవీలోను, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.

    English summary
    Vijay Deverakonda wins Hyderabad Times 30 Most Desirable Men 2020 title. First person to win it 3 times in a row in the history of most desirable. Ram, Jr NTR, Ram Charan are in the list
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X