ఉత్తరాదిలో విజయ్ దేవరకొండ హంగామా.. 100 మిలియన్లతో దూసుకెళ్తున్న వరల్డ్ ఫేమస్ లవర్

క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ కెరీర్‌ను ఆరంభించి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు' అనే సినిమాలో డీసెంట్‌గా కనిపించిన అతడు.. ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'లో మాత్రం వైలెంట్‌గా దర్శనమిచ్చాడు. ఇక, అనంతరం 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి హిట్లను అందుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు చివరిగా నటించిన చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. కానీ, తాజాగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

విజయ్ దేవరకొండ - క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'వరల్డ్ ఫేమస్ లవర్'. కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ ఈ సినిమాను నిర్మించింది. ఇందులో ఐశ్వర్య రాజేష్‌, రాశీ ఖన్నా, ఇజబెల్లె లైట్, కేథరిన్‌ హీరోయిన్లుగా నటించారు.

Vijay Deverakonda World Famous Lover Hindi dub Version Hits 100M Views

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విజయ్ అభిమానులను సైతం నిరాశ పరిచింది. ఫలితంగా నిర్మాతలకు నష్టాలు ఎదురయ్యాయి. ఇక, ఈ సినిమా బుల్లితెరపై కూడా అంతగా రాణించలేదు. కానీ, యూట్యూబ్‌లో మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో స్పందనను అందుకుంటూ దూసుకెళ్తోంది.

'వరల్డ్ ఫేమస్ లవర్' అదే పేరుతో హిందీలోకి డబ్ అయింది. ఈ మొత్తం సినిమాను యూట్యూబ్‌లో విడుదల చేశారు. తెలుగులో పెద్దగా సక్సెస్ కాకున్నా.. ఉత్తరాది ప్రేక్షకులు మాత్రం దీనిపై మక్కువ చూపించారు. ఫలితంగా ఈ చిత్రం అక్కడ సూపర్ హిట్ అయింది. అంతేకాదు, తాజాగా ఇది 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు, 1.9 మిలియన్ లైకులను కూడా దక్కించుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X