‘వరల్డ్ ఫేమస్ లవర్’ స్టోరీ లీక్.. సరికొత్త యాంగిల్ చూపించబోతున్న విజయ్ దేవరకొండ

By Manoj Kumar P

'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. తన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. మరెవరికీ సాధ్యం కాని విధంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. సినిమా జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడీ యంగ్ హీరో. గత ఏడాది ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'డియర్ కామ్రేడ్' బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. ఈ నేపథ్యంలో అతడు 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాను చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ స్టోరీ లీక్ అయింది. అసలేంటీ కథ.?

నలుగురు అమ్మాయిలకు ఒక్కడే

నలుగురు అమ్మాయిలకు ఒక్కడే

విజయ్ దేవరకొండ - క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే ‘వరల్డ్ ఫేమస్ లవర్'. కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో ఐశ్వర్య రాజేష్‌, రాశీ ఖన్నా, ఇజబెల్లె లైట్, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నలుగురిని ప్రేమించే వ్యక్తిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు.

వరుసగా వదిలారు.. మెప్పు పొందారు

ఇటీవల ఈ సినిమాలో నటించే నలుగురు హీరోయిన్లకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో ఆ హీరోయిన్ చేస్తున్న పాత్రతో పాటు విజయ్ దేవరకొండ కూడా కనిపించాడు. వీటన్నింటికీ భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అలాగే, నాలుగు రోజుల క్రితం ఈ సినిమా టీజర్ కూడా వదిలారు. దీనికి విశేష ఆదరణ లభించింది.

ఇందులోనూ ఆ సినిమా ఛాయలు

ఇందులోనూ ఆ సినిమా ఛాయలు

ఇంతకు ముందు వరకు ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు మాత్రమే ఉన్నాయన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, టీజర్ రిలీజ్ అయిన తర్వాత అవన్నీ రెట్టింపు అయిపోయాయి. అందులో విజయ్ దేవరకొండ నటన ‘అర్జున్ రెడ్డి'ని గుర్తు చేస్తోంది. అలాగే, రాశీ ఖన్నా బోల్డ్ సీన్స్.. విజయ్ డైలాగ్ హైలైట్‌గా నిలిచాయి. దీంతో ఈ వీడియో వైరల్ అయిపోయింది.

విజయ్ దేవరకొండ మారిపోయాడు

విజయ్ దేవరకొండ మారిపోయాడు

ఈ టీజర్ విడుదలైన తర్వాత సినిమా గురించి మాట్లాడుకుంటున్న వారు.. ఓ ప్రత్యేకమైన విషయాన్ని గుర్తించారు. ఇందులోని టైటిల్స్‌లో విజయ్ దేవరకొండ పేరు ‘దేవరకొండ విజయ్ సాయి' అని కనిపించింది. దీంతో ఈ రౌడీ స్టార్ హీరో పేరు మార్చుకున్నాడని అందరికీ తెలిసింది. అదే సమయంలో అతడు ఎందుకిలా చేశాడని చాలా మంది చర్చించుకుంటున్నారు కూడా.

‘వరల్డ్ ఫేమస్ లవర్' స్టోరీ లీక్

‘వరల్డ్ ఫేమస్ లవర్' స్టోరీ లీక్

‘వరల్డ్ ఫేమస్ లవర్' స్టోరీ లీక్ అయిందంటూ తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సినీ రచయితగా కనిపించబోతున్నాడట. ఇందులో భాగంగానే అతడు రాసే స్టోరీల్లో తనను తాను హీరోగా ఊహించుకుంటాడట. ఒకదాని తర్వాత మరొకటి మొత్తం నాలుగు స్టోరీలు రాసుకుంటాడని, వాటి సారాంశంతోనే సినిమా రాబోతుందని అంటున్నారు.

సినిమా మొత్తానికి బలం అదే

సినిమా మొత్తానికి బలం అదే

ఈ సినిమాలో విజయ్ నాలుగు పాత్రల్లో కనిపించబోతున్నాడని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ నాలుగు స్టోరీలు ఒకదాని తర్వాత ఒకటి నడుస్తాయట. అంటే గతంలో వచ్చిన ‘కేరాఫ్ కంచరపాలెం', ‘మనమంతా' సినిమాలు గుర్తుకు వచ్చేలా ఉంటుందట. ఈ సినిమా మొత్తానికి స్క్రీన్ ప్లేనే బలం అనే టాక్ వినిపిస్తోంది. కాబట్టి దీనిపై బాగా ఫోకస్ చేశాడట డైరెక్టర్ క్రాంతి మాధవ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X