twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా గర్ల్‌ఫ్రెండ్ గురించా? కాబోయే భార్య ఎలా ఉండాలంటే.. విజయ్ దేవరకొండ క్లారిటి

    |

    లాక్‌డౌన్‌లో స్వీయ గృహ నిర్బంధంలో ఉంటూ యువ హీరో విజయ్ దేవరకొండ అనేక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. మిడిల్ క్లాస్ ఫండ్ పేరిట సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో ఆకలితో పస్తులుండే వారి కోసం నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలతో కాలం గడుపుతున్న విజయ్ దేవరకొండ తాజాగా జాతీయ ఆంగ్ల టెలివిజన్ ఛానెల్‌తో తన భావాలను పంచుకొన్నారు. ఈ సందర్భంగా స్నేహితుుల, పెళ్లి, ప్రేమ, ప్రియురాలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. అవేమిటంటే..

    Recommended Video

    Vijay Devarakonda Be The Real Man Challenge Video
    రానా, రణ్‌బీర్ కపూర్ అంటే ఇష్టం

    రానా, రణ్‌బీర్ కపూర్ అంటే ఇష్టం

    టాలీవుడ్‌లో నాకు నిజమైన స్నేహితుడు అంటే రానా దగ్గుబాటి. మొదటి నుంచి అలా కనెక్ట్ అయ్యాను. రానాతో ఉంటే సమయమే తెలియదు. ఎక్కువగా రానాతో కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇక బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ఓ రకమైన క్రేజ్. వీరే కాకుండా నాకు మనసు దగ్గరైన హీరోలు, దర్శకులు, సినీ ప్రముఖులు ఉన్నారు. వారి గురించి చెప్పుకొంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

     ఇంకా సెటిల్ కావాలి

    ఇంకా సెటిల్ కావాలి

    పెళ్లి విషయంలో నాకు తొందరలేదు. ఇంకా నేను సెటిల్ కావాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వచ్చాను. చాలా విషయాలపై దృష్టిపెట్టాను. సమయం లేకుండా పనిచేస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌తో కాస్త ఊరట లభించింది. చాలా రోజుల తర్వాత నిద్ర, సరైన ఫుడ్, ఫ్యామిలీలో సరైన సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పడంతా నా దృష్టి కెరీర్ మీదే ఉంది అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

    పెళ్లి చేసుకొనే మెచ్యురిటీ

    పెళ్లి చేసుకొనే మెచ్యురిటీ

    పెళ్లి విషయంపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. నా తల్లిదండ్రులు ఇంకా నన్ను చిన్న పిల్లాడిలానే చూస్తున్నారు. ప్రతీ ఒక్కరి అన్ని విషయాలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదనుకొంటాను. నేను నాలా ఉండాలనే ప్రయత్నిస్తుంటాను. ఒకరిని నీ జీవితంలో ఆహ్వానించి పెళ్లి చేసుకొంటున్నావంటే చాలా బాధ్యతగా ఉండాలి. ఆ బంధాన్ని గౌరవించే స్థాయిలో మానసిక పరిణితి ఉండాలి. ఏదైతే అదేలే అనే ఆలోచనను మానుకోవాలి. ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా గ్రహించాలి అని విజయ్ దేవరకొండ అన్నారు.

    నా తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి

    నా తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి

    నా తల్లిదండ్రులు నా పెళ్లి గురించి అంతగా ఒత్తిడి చేయడం లేదు. కాకపోతే అప్పుడప్పుడు హింట్స్ ఇస్తుంటారు. నాకు నా ఫ్యామిలీ అంటే ఎనలేని గౌరవం. నాలో పెళ్లి చేసుకోవాలని, పిల్లలు కనాలనే ఆలోచన పెడుతుంటారు. పెళ్లి అనేది దానికి ఓ సమయం వస్తుంది. అప్పుడు మనం ఆపినా దానిని ఎవరూ ఆపలేరు. వైవాహిక జీవితానికి కావాల్సిన పరిణితి నాలో లేదనిపిస్తుంది. మానసికంగా ఇంకా ఎదగాలి అని విజయ్ దేవరకొండ అన్నారు.

    నాకు కాబోయే భార్య ఎలా ఉండాలంటే

    నాకు కాబోయే భార్య ఎలా ఉండాలంటే

    నేను పెళ్లి చేసుకొనే అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలంటే.. దయాగుణం కలిగి ఉండాలి. సంతోషంగా లైఫ్‌ను ఎంజాయ్ చేసే మనస్తత్వం ఉండాలి. ఎప్పుడూ ఎదుటివారిని సంతోష పెట్టేలా ఉండాలి. నీవు లాక్‌డౌన్‌లో ఉంటే.. నీకు ఎలాంటి ప్రస్టేషన్ రాకుండా చూసుకొనే అమ్మాయి కావాలి. ఆమెతో ఉంటే జీవితం మొత్తం హాలీడేలా ఉండాలనిపించాలి. అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి దొరికితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాను అని విజయ్ దేవరకొండ చెప్పారు.

    English summary
    Tollywood Vijay Deverkonda in lockdown serving for poor people. He reaveled about financial status in chiildhood and says his father is inspiration for his life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X