twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాల్యంలో చదువుకొనేందుకు డబ్బుల్లేవు.. వాళ్లే ఉచితంగా విద్య.. విజయ్ దేవరకొండ ఎమోషనల్

    |

    దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సినీ తారల మాదరిగానే విజయ్ దేవరకొండ ఇంటికే పరిమితమయ్యారు. కరోనావైరస్‌ను తరిమి కొట్టడానికి పోరాటం చేస్తున్న పోలీసులు, ఇతర ఉద్యోగులు అండగా నిలుస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ ఫౌండేషన్ తరఫున ఈ కష్టకాలంలో పేదలకు నిత్యావసర వస్తువులు ఇచ్చే సేవను తెలుగు రాష్ట్రాల్లో చేపట్టారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ జాతీయ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడుతూ..

    ఫ్యాన్ బేస్

    ఫ్యాన్ బేస్

    అర్జున్ రెడ్డి సినిమాతో నాకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. ఆ తర్వాత అదే స్థాయిలో అర్జున్ రెడ్డి రీమేక్‌ కబీర్ సింగ్‌కు ఆదరణ దక్కడంతో నాకు ఇంకా ఫ్యాన్స్ బేస్ పెరిగింది. బాలీవుడ్‌లో కూడా నాకు గుర్తింపు రావడం గొప్ప ఫీలింగ్. హిందీలో కరణ్ జోహర్‌తో సినిమా చేస్తున్నాం. పూరీ జగన్నాథ్, చార్లీతో ప్రాజెక్టు దాదాపు సగం కంటే ఎక్కువగానే పూర్తయింది. అనన్య పాండేతో వర్క్ చేస్తున్నాను. వచ్చే ఏడాది బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరవుతాను అని విజయ్ దేవరకొండ చెప్పారు.

    ఇంటి పనులు, హాస్టల్

    ఇంటి పనులు, హాస్టల్

    లాక్ డౌన్ సమయంలో ఫ్యామిలీ మ్యాన్‌గా మారిపోయాను. ఇంతకు ముందు ఇంటిలో కిచెన్‌లోకి వెళ్లిన దాఖలాలు లేవు. ఛాలెంజ్‌లో భాగంగా ఐస్ క్రీమ్ చేసినప్పుడు అమ్మను అడిగి తెలుసుకొన్నాను. అయితే ఇలాంటి పనులు చేయడం నాకు స్కూలింగ్ నుంచి నా బెడ్, బట్టలు, వస్తువులు సర్దుకోవడం అలవాటు. పుట్టపర్తి సత్యసాయి స్కూల్‌లో ఇలాంటి పనులు నేర్చుకొన్నాను అని విజయ్ దేవరకొండ అన్నారు.

    లాక్‌డౌన్‌లో ప్రజల కోసం

    లాక్‌డౌన్‌లో ప్రజల కోసం

    లాక్‌డౌన్‌లో ప్రజలకు సేవ చేయాలనుకోవడం వెనుక నా ఫిలాసఫీ వేరే ఉంది. నేను ఎదిగే క్రమంలో ఎంతో మంది సహకారం తీసుకొన్నాను. ఓ దశలో నన్ను చదివించడానికి నా ఫ్యామిలీ వద్ద డబ్బుల కూడా లేవు. ఆ సమయంలో సత్యసాయి స్కూల్ నాకు ఉచితంగా చదువుకొనే అవకాశం కల్పించింది. ఈ రోజు ఇలా ఉన్నానంటే ఆ స్కూల్‌లో నేర్చుకొన్న చదువు, విలువలే. అలా నా జీవితంలో చాలా మంది హెల్ప్ చేశారు. ఇప్పడు నా కంటూ ఓ హోదా వచ్చిన తర్వాత తిరిగి ఇవ్వడం నేర్చుకొన్నాను అని విజయ్ దేవరకొండ తెలిపారు.

    మా నాన్న నాకు జీవితంలో స్పూర్తిదాయకం

    మా నాన్న నాకు జీవితంలో స్పూర్తిదాయకం

    మా నాన్న నాకు జీవితంలో స్పూర్తిదాయకం. ఆయన జీవితంలో ఎత్తుపల్లాలు, విజయాలు, వైఫల్యాల నుంచి నేర్చుకొన్నాను. ఆయన థియేటర్, టెలివిజన్‌లో ఉండటం నేను యాక్టింగ్ కెరీర్‌లోకి రావడానికి కొంత సులభమైంది. ఇక పుస్తకాలు చదవడం ద్వారా పరిణితి సాధించాను. ఏది మంచి, ఏది చెడు అనే విషయాలను గ్రహిస్తే అన్ని చక్కగా సాగిపోతాయి అని విజయ్ దేవరకొండ చెప్పారు.

     అర్జున్ రెడ్డి రీమేక్ ఇంకా చూడలేదు

    అర్జున్ రెడ్డి రీమేక్ ఇంకా చూడలేదు

    అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ఇంకా చూడలేదు. నాకు సమయం చిక్కడం ఒక కారణం. నేను చేసిన సినిమాలో ప్రతీ బిట్ నాకు తెలుసు. ప్రతీ ఎమోషన్ నాకు కనెక్ట్ అయింది. హిందీలో చేయమని అడిగితే నాకే చేయడం ఇష్టం లేదని చెప్పాను. మళ్లీ ఒకసారి చేసిన సినిమా మరొసారి నాకు చేయడం ఇష్టం లేకనే కబీర్ సింగ్ చేయలేదు అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

    English summary
    Tollywood Vijay Deverkonda in lockdown serving for poor people. He reaveled about financial status in chiildhood and says his father is inspiration for his life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X