కేరళ వరదలు: ఆ హీరో కోట్లు ఇవ్వలేదు... ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్లే ఇదంతా!
Recommended Video

భారీ వర్షాలు వరదల కారణంగా కేరళ చిగురుటాకులా వణికిపోయింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద బీభత్సానికి వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. వేల కోట్ల నష్టం ఏర్పడింది. తమ సహాయం అందించాలని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కోరడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు, సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తమకు తోచిన సాయం చేస్తున్నారు. పలువురు సినీ స్టార్లు లక్షల్లో విరాళాలు ప్రకటించారు. ఇరత రాష్ట్రాల ప్రభుత్వాలు కోట్ల రూపాయిలు సాయం ప్రకటించాయి.

అభిమానుల అత్యుత్సాహం
అయిదే ఇదే అదునుగా కొందరు సినీ హీరోల అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ హీరో ఇన్ని కోట్లు ఇచ్చారు, అన్ని కోట్లు ఇచ్చాడు అంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. తమిళ హీరో విజయ్ విషయంలో ఇలాంటి ప్రచారమే జరిగింది. ఆయన 14 కోట్ల విరాళం ఇచ్చారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

అసలు విజయ్ ఎంత ఇచ్చారు?
అయితే విజయ్ రూ. 14 కోట్లు సహాయం అందించారని జరుగుతున్న ప్రచారం నిజం కాదని తేలిపోయింది. కేరళ వరద బాధితుల కోసం రూ. 70 లక్షల సహాయం అందిస్తున్నట్లు విజయ్ ప్రకటించడంతో క్లారిటీ వచ్చింది.

అభిమాన సంఘాల ద్వారా
విజయ్ ఈ మొత్తాన్ని క్యాష్ రూపంలో కాకుండా... రూ.70 లక్షల విలువైన ఆహార పదార్థాలు, దుస్తులు, దుప్పట్లు, పాలపొడి, శానిటరీ నేప్‌కిన్లు, మందులు, ఇతర వస్తువులను అభిమాన సంఘాల ద్వారా వరద ముంపుకు గురైన 12 జిల్లాలకు పంపించారు.

ఫుట్‌బాల్ స్టార్ రూ. 77 కోట్లు ఇచ్చినట్లు ప్రచారం
మరో వైపు ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ స్టార్, పోర్చుగీస్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో గురించి ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. ఇతగాడు కేరళ వరద బాధితులకు రూ. 77 కోట్ల సహాయం అందించినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేక పోవడంతో ఫేక్ న్యూస్ అయిన భావిస్తున్నారు.

ఇతర స్టార్లు
తమిళనాడు రాజకీయ నేత, మాజీ నటుడు విజయ్ కాంత్ రూ. 1 కోటి విలువైన సామాగ్రి కేరళకు పంపిస్తున్న ప్రకటించారు. తమిళ స్టార్లు కమల్ హాసన్ 25 లక్షలు, సూర్య, కార్తి రూ. 25 లక్షలు, కీర్తి సురేష్ 15 లక్షలు సహాయం అందించారు. తెలుగు నుండి చిరంజీవి 25 లక్షలు, మహేష్ బాబు రూ. 25 లక్షలు, ఎన్టీఆర్ రూ. 25 లక్షలు, అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, రామ్ చరణ్ రూ. 25 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 10 లక్షలు, విజయ్ దేవరకొండ రూ. 5 లక్షలు, రామ్ 5 లక్షలు విరాలం ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











