సీమరాజా ట్రైలర్ కాపీ.. విరుచుకుపడుతున్న విజయ్ ఫ్యాన్స్!
తమిళ హీరో శివ కార్తికేయన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం సీమ రాజా. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదల చేశారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ స్టార్ హీరో విజయ్ ఫాన్స్ విరుచుకుపడుతున్నారు.
సీమరాజా ట్రైలర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. విజయ్ నటించిన మెర్సల్ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ గుర్రాల మధ్య ఉండే షాట్ ని సీమరాజాలో కాపీ చేసారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
సీమరాజా ట్రైలర్ పై ట్రోలింగ్ కొనసాగుతోంది. సమంత, శివ కార్తికేయన్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. పోనారం ఈ చిత్రానికి దర్శకుడు. కాపీ షాట్ పై చిత్ర యూనిట్ ఎలాటి వివరణ ఇస్తుందో చూడాలి.



Click it and Unblock the Notifications











