తమ హీరోను బ్రతికించారు... ప్రత్యర్థి వర్గం హీరో ఫ్యాన్స్‌కు చుక్కలు చూపించారు!
తమిళ స్టార్ విజయ్‌కి తన సొంత రాష్ట్రంతో పాటు సౌతిండియా వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. తమ హీరో గురించి ఏ చిన్న నెగెటివ్ కామెంట్ చేసినా విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ప్రతాపం చూపిస్తూ ఉంటారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో విజయ్ అభిమానులదే ఆధిపత్యం. వారితో తలపడటం ఇతర హీరోల ఫ్యాన్స్‌కు కాస్త కష్టమైన పనే.
అయితే ఎవరు చేశారో? ఎందుకు చేశారో? తెలియదు కానీ... రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో #RIPactorVIJAY అనే యాష్ ట్యాగ్ ట్రెండింగులోకి వచ్చింది. ఇది అజిత్ ఫ్యాన్స్ నిర్వాకం అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తమ హీరో చనిపోయినట్లు జరుగుతున్న తప్పుడు ప్రచారంతో విజయ్ అభిమానులు బాగా హర్ట్ అయ్యారు.

ఎందుకు చేశారో ఎవరికీ అంతు పట్టడం లేదు?
జీవించి ఉన్న ఒక హీరో చనిపోయాడు అంటూ తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఎలాంటి లాభం పొందాలని చూశారో? అసలు ఎవరు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారో? తెలియదు కానీ.... దీనిపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తున్నాయి. పోటీ తత్వం అనేది ఆరోగ్యకరంగా ఉండాలి కానీ ఇలా దిగజారుడుతనంగా ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరూ చెబుతున్నమాట.

తమ హీరోను బ్రతికించారు... ప్రత్యర్తి వర్గం హీరో ఫ్యాన్స్‌కు చుక్కలు చూపించారు!
#RIPactorVIJAY ప్రచారానికి ప్రతీకారంగా విజయ్ అభిమానులు రంగంలోకి దిగారు. #LongLiveVIJAY విజయ్ అనే యాష్ ట్యాగ్ ట్రెండింగులోకి తేవడం ద్వారా తమ హీరోను బ్రతికించారు. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగిన తర్వాత ప్రత్యర్థి హీరో అభిమానులు చుక్కలు కనిపించాయని చెప్పొచ్చు.

తమిళనాడు వ్యాప్తంగా ప్రార్థనలు
తమ హీరోపై జరుగుతున్న చెడు ప్రచారాన్ని, అత్యంత హేయమైన ప్రచారాన్ని తిప్పుకొడుతూ కొందరు ఫ్యాన్స్ తమిళనాడు వ్యాప్తంగా ప్రార్థనలు కూడా చేయడం గమనార్హం. #IgnoreNegativity అంటూ కొందరు ఈ పరిస్థితి సద్దుమనిగే ప్రయత్నాలు చేస్తున్నారు.

కోలీవుడ్ స్టార్స్ మద్దతు
#RIPactorVIJAY యాష్ ట్యాగ్ ట్రెండింగులోకి రావడంపై పలువురు కోలీవుడ్ స్టార్స్ సైతం స్పందించారు. ఇలాంటి ప్రచారం మంచిది కాదని, ప్రతి ఒక్కరూ నెగిటివిటీ వదిలేయాలని, అభిమానుల మధ్య సామరస్య పూర్వక వాతావరణం నెలకొనాలని నటుడు సత్యరాజ్ సూచించారు.


Click it and Unblock the Notifications











