సీఎం కొడుకుతో సినిమా చేయబోతున్న నితిన్ డైరెక్టర్!
నితిన్ నటించిన గుండెజారి గల్లంతయ్యిందే ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంతో విజయ్ కుమార్ కొండా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి చిత్రంతోనే హిట్ అందుకోవడంతో సినీవర్గాల్లో ఈ దర్శకుడిపై ఆసక్తి పెరిగింది. ఆ తరువాత విజయ్ కుమార్ నాగ చైతన్య హీరోగా ఒక లైలా కోసం అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం యావరేజ్‌గా నిలిచింది. ఆ తరువాత ఈ దర్శకుడి నుంచి మరో చిత్రం రాలేదు.
తాజాగా విక్రమ్ కుమార్ కన్నడ హీరో నిఖిల్ గౌడని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ గౌడ కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు. నిఖిల్ తెలుగులో జాగ్వార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం కన్నడలో సీతా రామ కళ్యాణ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

త్వరలనే విజయ్ కుమార్, నిఖిల్ చిత్రం ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో ఈ దర్శకుడు కన్నడ బాట పట్టాడు. మరి గుండెజారి గల్లంతయ్యిందే దర్శకుడి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











