Don't Miss!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
మహేష్ సినిమాలో విజయ్ మాల్య.. బిగ్ షాట్స్ మోసాలపై స్పెషల్ టార్గెట్!
సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాటపై ఆడియెన్స్ లో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ నెలకొన్న విషయం తెలిసిందే. సినిమా టైటిల్ పోస్టర్ తోనే అంచనాల డోస్ పెంచారు. ఇక సూపర్ స్టార్ ఫస్ట్ లుక్ వస్తే అభిమానుల్లో కనిపించే జోష్ మామూలుగా ఉండదు. ఇకపోతే సినిమాకు సంబంధించిన మరొక రూమర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమా అసలు కథ..
సినిమాకి సంబంధించిన అసలు కథ ఇదేనని గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఎక్కువగా అయితే ఇది బ్యాంక్ స్కామ్ లకు సంబంధించిన కొన్ని సమస్యల చుట్టూ తిరిగే కథ అని సమాచారం. ఇక మహేష్ ఒక బిజినెస్ మ్యాన్ గానే కాకుండా ఒక రికవరీ ఆఫీసర్ గా కూడా కనిపిస్తాడని టాక్ వచ్చింది.
విజయ్ మాల్య పాత్ర
అలాగే మహేష్ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ లలో కనిపిస్తాడని కూడా టాక్ వచ్చింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. విజయ్ మాల్యా పాత్ర ఆధారంగా ఇందులో ఒక నెగిటివ్ రోల్ ని డిజైన్ చేశారట. దర్శకుడు పరశురామ్ ఎక్కువగా ఋణాలు ఎగ్గొట్టే బిగ్ షాట్స్ పైనే స్పెషల్ గా ఫోకస్ చేసినట్లు రూమర్స్ వస్తున్నాయి.
ఆ బిగ్ షాట్స్ ఎవరు?
విజయ్ మాల్య ఎపిసోడ్ తో పాటు మోసాలు చేసి బయటపడిన మరో ఇద్దరిని కూడా సినిమాలో చూపించనున్నారట. ఋణాలు ఎగ్గొట్టే విధానం.. ఆ తరువాత రాజకీయ నాయకుల ద్వారా సేఫ్ గా వాటి నుంచి ఎలా బయటాడతారు అనే సీక్రెట్ విషయాల్ని కూడా సినిమాలో హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే మహేష్ సినిమా మొదటిసారి ఊహించని కాంట్రవర్సీ కథతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
మహేష్ హైలెట్ అయ్యే సీన్స్..
ఇక సర్కారు వారి పాటలో ఇంటర్వెల్ తరువాత వచ్చే ఎమోషనల్ సీన్స్ తో పాటు మహేష్ నటన కూడా మునుపెన్నడు చూడని విదంగా ఉంటుందట. కొన్ని ఎపిసోడ్స్ లో మహేష్ మరోసారి రైతుల సమస్యల గురించి మాట్లాడే విధానం అద్భుతంగా ఉంటుందట. సినిమా ద్వారా సరిపడా ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెస్సేజ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.