ఫుట్ బాల్ కోచ్‌గా స్టార్ హీరో చిత్రం.. 16 మంది అమ్మాయిలు!
ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న చిత్రాలకు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తిరుగులేకుండా ఉంది. కాస్త పర్వాలేదని టాక్ వచ్చినా వందల కోట్ల వసూళ్లు నమోదవుతున్నాయి. గత ఏడాది విడుదలైన సర్కార్ చిత్రం విషయంలో అదే జరిగిది. కత్తి, తుపాకీ, తేరి, మెర్సల్, సర్కార్ ఇలా బ్లాక్ బస్టర్ విజయాలతో విజయ్ తమిళంలో తిరుగులేని హీరోగా మారిపోయాడు. ఇదిలా ఉండగా దర్శకుడు అట్లీ, విజయ్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో చిత్రానికి రంగం సిద్ధం అయింది.
అట్లీ క్రీడా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ ఈ చిత్రంలో ఫుట్ బాల్ కోచ్ గా కనిపిస్తాడట. ఫుట్ బాల్ టీం కోసం అట్లీ 16 మంది అమ్మాయిలని ఎంపిక చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. కక్రీడల్లోని రాజకీయాలని అట్లీ ఈ చిత్రం ద్వారా బయట పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మెర్సల్ చిత్రంలో అట్లీ భర్త వైద్య రంగంపై గురిపెట్టాడు. ఆ చిత్రం దేశ వ్యాప్తంగా తీవ్ర వివాదం సృష్టించింది. గత ఏడాది సర్కార్ చిత్రంతో రాజకీయ వర్గాల్లో విజయ్ ప్రకంపనలు సృష్టించాడు. తాజాగా విజయ్ టచ్ చేయబోతున్న క్రీడా రంగ అంశం ఎన్ని సంచలనాలకు కారణం అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











