చిన్న పిల్లాడితో ఆడుకుంటున్న విజయ్.. వీడియో వైరల్!
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం సర్కార్. సందేశాత్మక చిత్రాల దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన సర్కార్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీపావళి కానుకగా సర్కార్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఓ వైపు సర్కార్ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంటే.. విజయ్ కి సంబంధించిన మరో వీడియో వైరల్ గా మారింది.

ఓ చిన్న పిల్లాడితో విజయ్ ఆడుకుంటున్న వీడియో నెటిజన్లని విపరీతంగా ఆకర్షిస్తోంది. క్యూట్ గా ఉన్న ఈ వీడియోకి అభిమానులు ఫిదా అవుతున్నారు. కానీ ఆ చిన్న పిల్లాడు ఎవరనేది మాత్రం తెలియలేదు. బుజ్జి బాబుతో విజయ్ సరదాగా గడిపాడు.
సినిమాల విషయానికి వస్తే విజయ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో ఇప్పటికే కత్తి, తుపాకీ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. దీనితో సర్కార్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


Click it and Unblock the Notifications











