ఇప్పుడు కోట్ల ఆదాయం.. ఒకప్పుడు ఫాస్ట్‌ఫుడ్‌లో పని చేశాను: విజయ్ సేతుపతి ఎమోషనల్ స్టోరీ

కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోల కంటే కూడా అక్కడ టాలెంట్ ఉన్న నటీనటులే చాలా ఎక్కువమంది ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా విజయ్ సేతుపతి లాంటి నటుడు మరెక్కడా లేడు. చేసే పాత్ర పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే సరైన న్యాయం చేస్తాడు. ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తన టాలెంట్ ఏమిటో నటించి చూపిస్తున్నాడు. ఇక తమిళ్ మాస్టర్ చెఫ్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సేతుపతి ఇటీవల ఒక ప్రోమోలో తన ఎమోషనల్ జర్నీ గురించి చెప్పాడు.

అందుకే ఇన్నేళ్లయినా అతని రేంజ్ తగ్గలేదు

అందుకే ఇన్నేళ్లయినా అతని రేంజ్ తగ్గలేదు

విజయ్ సేతుపతి కేవలం హీరోగానే కాకుండా ఒక సహా నటుడిగా కూడా ఎంతగానో క్రేజ్ అందుకున్నాడు. ఇక విలన్ పాత్రలతో అయితే సినిమాలకు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఎలాంటి సినిమా అయినా సరే ముందు పాత్రకు ఎంతవరకు న్యాయం చేశాము అనే విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తుంటడు. అందుకే ఇన్నేళ్లయినా అతని రేంజ్ తగ్గలేదు.

తెలుగులో కూడా

తెలుగులో కూడా

విజయ్ సేతుపతి కోసమని కూడా పాత్రలో బలాన్ని పెంచే దర్శకులు ఉంటారు. మాస్టర్ సినిమాలో స్టార్ హీరో విజయ్ కు విలన్ గా నటించిన విషయం తెలిసిందే. సేతుపతి వల్లనే తెలుగులో కూడా ఆ సినిమాకు భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అతనికి మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఉప్పెనలో విలన్ రోల్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఫాస్ట్‌ఫుడ్‌లో పని చేశాను

ఫాస్ట్‌ఫుడ్‌లో పని చేశాను

ఇక ప్రస్తుతం మాస్టర్ చెఫ్ అనే రియాలిటీ షోకు హోస్ట్ గా ఉంటున్న విజయ్ సేతుపతి ప్రమోషన్ లో ఆకలిపై ఉన్న అనుబంధం గురించి చెప్పాడు. చిన్నప్పుడు కుటుంబ పోషణ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేసినట్లు చెబుతూ సాయంత్రం 7గంటల నుంచి అర్ధరాత్రి 12గంటల వరకు పని చేసినట్లు చెప్పాడు.

ఆ ఐటెమ్ ఎక్కడా దొరకడం లేదు

ఆ ఐటెమ్ ఎక్కడా దొరకడం లేదు

డబ్బులు రావడమే కాకుండా ఒక విధంగా ఆకలి కూడా తీరుతుందనే కారణం చేత ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చాలా కాలం వర్క్ చేసినట్లు చెప్పాడు. ఇక తనకు ఉల్లి సమోసా అంటే చాలా ఇష్టమని చెప్పిన విజయ్ సేతుపతి ప్రస్తుతం అది ఎక్కడా దొరకడం లేదని అన్నారు. ఇక ప్రతీ రోజు ఇంట్లోనే ఆ ఐటెమ్ చేసుకొని టీ తాగుతూ తింటానని చెప్పాడు.

 20కి పైగా ప్రాజెక్టులు.. సాలీడ్ రెమ్యునరేషన్

20కి పైగా ప్రాజెక్టులు.. సాలీడ్ రెమ్యునరేషన్

ఇక విజయ్ సేతుపతి చేతిలో ప్రస్తుతం పది ప్రాజెక్టులకు పైగా ఉన్నాయి. లాక్ డౌన్ వలన చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో పడ్డాయి. ఇక అతని కమిట్మెంట్స్ అయితే 20కి పైగానే ఉన్నాయి. అందులో సగం పూర్తయ్యే వరకు వేరే ప్రాజెక్టులను ఓకే చేయవద్దని అనుకుంటున్నాడు. సేతుపతి ఒక్కో సినిమాకు 8 కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X