Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్‌ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్టార్ హీరోలతో కొట్టించుకోవలంటే మినిమమ్ 10కోట్లు.. డోస్ పెంచుతున్న టాలెంటెడ్ యాక్టర్
కోలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోలున్నా కూడా అక్కడ టాలెంటెడ్ యాక్టర్స్ కి ఉన్న క్రేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటివల కాలంలో మంచి క్రేజ్ అందుకుంటున్న కోలీవుడ్ యాక్టర్స్ లో విజయ్ సేతుపతి ఒకరు. పాత్ర నచ్చితే ఈ హీరో విలన్ గా చేయడానికి కూడా సిద్ధమవుతున్నాడు. అందుకోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
బెస్ట్ యాక్టర్..
ఇండియన్ టాప్ బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో విజయ్ సేతుపతి పేరు ఉండాల్సిందే. స్టార్ హీరోల నుంచి స్టార్ డైరెక్టర్స్ వరకు అందరూ కూడా మనోడి యాక్టింగ్ కి ఫిదా అవుతున్నారు. హీరోగా క్లిక్కయిన తరువాత కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు. ఇటీవల సైరా సినిమాలో స్పెషల్ పాత్రలో కనిపించి మంచి క్రేజ్ అందుకున్నాడు.
భారీ డిమాండ్..
ప్రస్తుతం విజయ్ సేతుపతి వివిధ భాషల్లో నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నాడు. కోలీవుడ్ దళపతి విజయ్ మాస్టర్ సినిమాలో సేతుపతి విలన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు 12కోట్ల వారికు తీసుకున్నాడట ఈ స్టార్ యాక్టర్. ఇక తెలుగులో ఉప్పెన సినిమాలో కూడా విలన్ గానే కనిపించబోతున్నాడు.
పాత్ర నచ్చితేనే..
విజయ్ సేతుపతి ఈ స్థాయిలో క్రేజ్ అందుకోవడానికి కారణం అతను ఎంచుకుంటున్న పాత్రలే. వచ్చిన ప్రతి సినిమాను ఒప్పుకోకుండా కేవలం పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. క్యారెక్టర్ చిన్నదైనా సరే సినిమాలో హైలెట్ అయ్యేలా ఉండాలని జాగ్రత్త పడుతుంటాడు.
Recommended Video
మినిమామ్ 10కోట్లు..
సాధారణంగా ఒక హీరో విలన్ రోల్స్ చేస్తే అతని మార్కెట్ కంటే కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మరొక హీరోతో యాక్షన్ సీన్ లో కొట్టించుకోవాలంటే పెద్ద సాహసమనే చెప్పాలి. ఇక పాజిటివ్ రోల్స్ చేసుకుంటున్న విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ ని నెగిటివ్ రోల్ కోసం తీసుకోవలంటే మినిమమ్ 10కోట్లు ఇవ్వాల్సిందే. ఇక చిన్న సినిమాలకు మాత్రం ఈ హీరో పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడు.