కూతురుతో రొమాన్స్ చేయమంటే... అది నా వల్ల కాదు.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలు అంటే.. తెల్లగా ఉండాలి. సిక్స్ ప్యాక్ ఉండాలి. హైట్ ఉండాలి అనుకునే ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శనీయం. ఇవన్నీ లేకపోయినా టాలెంట్ ఉంటే.. ఎవరూ ఆపలేరు అని రుజువు చేశాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించిన సేతుపతి.. హీరోగా మారి.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు.

హీరోలు అంటే కేవలం హీరో పాత్రలే చేయాలి అనేది లేకుండా నటుడిగా ఎదిగాడు. పాత్రకు ప్రాధాన్యత ఉంటే హీరో, విలన్, సపోర్టింగ్ రోల్ అనే తేడా కూడా చూడడు. విజయ్ సేతుపతి సినిమాలకన్నా తన వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. స్టార్ గా ఎదిగాక.. ఫ్యాన్స్ దగ్గరకు వెళ్ళడానికి కూడా రేంజ్ చూపించే నటులు ఉన్న ఈ జనరేషన్ లో ఫ్యాన్స్ ను హాగ్ చేసుకొని, ముద్దు పెట్టుకొని ఫోటోలు దిగడం ఆయనకు అలవాటు. అలా విజయ్ సేతుపతి అభిమానులను సంపాదించుకున్నాడు.

Vijay Sethupathi On Refusing To Work Opposite Krithi Shetty

ఇదొక్కటే కాదు.. డబ్బు కోసం తన విలువలను ఎప్పుడు పోగొట్టుకోలేదు. డబ్బు ఎక్కువ ఇస్తాం అంటే ఎవరితో రొమాన్స్ చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు. కానీ, విజయ్ మాత్రం.. ఎంత డబ్బు ఇచ్చినా కొన్ని పాత్రలు చేయడానికి ఇష్టపడను అని చెప్పుకొచ్చాడు. ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన విజయ్ సేతుపతి.. ఈ చిత్రంలో కృతి శెట్టికి తండ్రిగా నటించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాదు.. నేషనల్ అవార్డును కూడా అందుకుంది.

ఇక ఈ సినిమా తరువాత కృతి శెట్టి తన పక్కన హీరోయిన్ గా చేయాల్సివస్తే నిర్మొహమాటంగా నో చెప్పాడు విజయ్ సేతుపతి. " నేను నటించిన డీఎస్పీ సినిమాలో మొదట కృతి శెట్టిని హీరోయిన్‌గా తీసుకుంటామన్నారు. కృతి అయితే నేను చేయలేనని దర్శక నిర్మాతలకు చెప్పా. అందుకు కారణం ఉప్పెన చిత్రంలో ఆమెకు తండ్రిగా నటించాను.

Vijay Sethupathi On Refusing To Work Opposite Krithi Shetty

ఉప్పెన లో కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్‌ సీన్స్‌ అస్సలు చేయలేను. అందుకే డీఎస్పీ సినిమాలో కృతిశెట్టి వద్దు అని చిత్ర బృందంకు చెప్పా. ఉప్పెనలో కొన్ని క్లైమాక్స్‌ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు కృతి చాలా కంగారు పడింది. నాకు నీ వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు, నన్ను నీ తండ్రిగా భావించు అని ధైర్యం చెప్పా. కూతురిగా భావించిన ఆమెకు జోడీగా ఎలా నటించాలి. అది నా వల్ల కాదు" అని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం విజయ్ సేతుపతి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న హీరో మనకు దొరకడం అదృష్టమని కోలీవుడ్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇకపొతేహ్ ప్రస్తుతం విజయ్ సేతుపతి మహారాజా సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో ఈ హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Read more about: vijay sethupathi krithi shetty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X