అల్లు అర్జున్‌కు భారీ ఎదురుదెబ్బ: హ్యాండిచ్చిన స్టార్ హీరో.. ‘పుష్ప’ నుంచి ఔట్.!
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'గంగోత్రి'తో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్న అతడు.. వరుసగా కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి సినిమా మినహా అన్నింటిలోనూ సరికొత్త స్టైల్‌తో కనిపించి స్టైలిష్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నాడు. అలాగే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లలో రాణిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్‌కు ఓ స్టార్ హీరో హ్యాండిచ్చాడనే న్యూస్ లీక్ అయింది. దీంతో కీలక టైమ్‌లో అతడికి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఆ వివరాలు మీకోసం.!
Recommended Video

ఆలస్యమైనా.. అదిరిపోయే హిట్ కొట్టాడు
కెరీర్ ఆరంభం నుంచీ వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన అల్లు అర్జున్.. ‘నా పేరు సూర్య' తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు. అయినప్పటికీ.. ‘అల... వైకుంఠపురములో' మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. గత సంక్రాంతికి వచ్చిన ఈ మూవీని త్రివిక్రమ్ తెరకెక్కించాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ మూవీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.

స్టార్ డైరెక్టర్‌తో మూడోసారి కలిసిన బన్నీ
‘అల.. వైకుంఠపురములో' ఫలితం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్నాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే అతడు స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్‌తో జత కట్టాడు. ‘ఆర్య', ‘ఆర్య2' తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. బడా సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

బన్నీ లేకుండానే మొదలు పట్టేసిన సుక్కూ
సుకుమార్ సినిమా కోసం అల్లు అర్జున్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో అతడి లుక్, యాస విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అన్నారు. అందుకోసం బన్నీ ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌లో పాల్గొనలేదు. ఇందులో అతడు లేని సీన్లను చిత్రీకరించాడు సుకుమార్.

అనుకున్నదే నిజమైంది.. అది మాత్రం షాక్
ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడినప్పటి నుంచే ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా కథ.. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందనే వార్తలు బాగా ప్రచారం అయ్యాయి. దానికి అనుగుణంగానే ఇటీవల విడుదలైన పోస్టర్‌లో బన్నీ లుక్ ఉంది. అయితే, ఈ మూవీకి ‘పుష్ప' అనే టైటిల్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు.

అదిరిపోయే రెస్పాన్స్.. రికార్డులు బద్దలు
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ ఐదు భాషల్లో రూపొందుతోంది. ఇక, ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇందులో భాగంగానే ట్విట్టర్‌లో అత్యధిక లైక్స్ రాబట్టిన చిత్రంగా ‘పుష్ప' నిలిచింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ' రికార్డు కనుమరుగైపోయింది.

హ్యాండిచ్చిన స్టార్ హీరో.. ‘పుష్ప' నుంచి ఔట్.!
తాజాగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం.. ఇందులో కీలక పాత్ర చేయబోతున్న తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి.. ‘పుష్ప' నుంచి తప్పుకున్నాడట. కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడడంతో, అతడి డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని సమాచారం. అందుకే ముందు ఒప్పుకున్న సినిమాల కోసం దీన్ని వదులుకున్నాడని టాక్.

కీలక సమయంలో అల్లు అర్జున్‌కు ఎదురుదెబ్బ
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీతో అన్ని ఇండస్ట్రీల్లో మార్కెట్ పెంచుకోవాలని బన్నీ భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే తమిళంలో భారీ పాపులారిటీ ఉన్న విజయ్‌ను తీసుకున్నారు. అయితే అతడు ఇప్పుడు ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో అల్లు అర్జున్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. దీంతో చిత్ర యూనిట్ మరొకరిని వెదుకుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











