పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మరోమారు.. సీక్వెల్ రెడీ!
తమిళ హీరో విజయ్ సేతుపతి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రతి చిత్రంలో అద్భుత నటన కనబరుస్తూ నయా కమల్ హాసన్ గా తమిళనాటి కీర్తి ప్రతిష్టలు అందుకుంటున్నాడు. కేవలం హీరో పాత్రలకు మాత్రం పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉంటె ఎలాంటి పాత్రలో అయినా తనదైన శైలిలో మెప్పిస్తున్నాడు. గత ఏడాది 96 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి ఈ ఏడాది మరిన్ని చిత్రాలకు సిద్ధం అవుతున్నాడు.
ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి తొలిసారి పోలీస్ అధికారిగా నటించిన చిత్రం సేతుపతి. ఈ చిత్రానికి సీక్వెల్ గా సేతుపతి 2 తెరకెక్కించాలని విజయ్ సేతుపతి నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలి భాగం కన్నా రెండో భాగాన్ని మరింత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దాలని విజయ్ సేతుపతి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్లానింగ్ విజయ్ సేతుపతి ప్రారంభించేసాడట.

విజయ్ సేతుపతి నటించిన ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సీక్వెల్ తెరకెక్కించే అవకాశం ఉంది. ఆ కథలు అలా ఉంటాయి. అభిమానులంతా ముందుగా 'ఇదక్కుతానే ఆశపట్టాయ్ బాలకుమారా' చిత్రానికి సీక్వెల్ చిత్రీకరించాలని కోరుకుంటున్నాడు. కానీ విజయ్ సేతుపతి మాత్రం సేతుపతి పైనే మనసు పెట్టాడు. విజయ్ సేతుపతి తెలుగులో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











