బాలకృష్ణకు విలన్‌గా విజయ్ సేతుపతి.. భారీగా రెమ్యునరేషన్ ఆఫర్‌తో..

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా టాలెంటెడ్ యాక్టర్స్ మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంటున్నారని చెప్పవచ్చు. అలాంటి వారిలో ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్న నటులలో విజయ్ సేతుపతి ఒకరు. ఆయన ఎంత బిజీగా ఉన్నారు అంటే ఒక సినిమా ఓకే చేయాలి అంటే మరొక సినిమా కోసం ఇచ్చిన డేట్స్ ను వాయిదా వేసుకునేంత బిజీగా ఉన్నారు. ఒక విధంగా ముందే కమిట్మెంట్స్ ఇవ్వడం మరణం చాలా వరకు నచ్చిన సినిమాలను కూడా వదులుకోవాల్సి వస్తోంది. అసలైతే లాక్ డౌన్ లేకపోయి ఉంటే విజయ్ సేతుపతికి ఈ తరహాలో ప్రాబ్లమ్ వచ్చి ఉండేది కాదు. కరోనా వలన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి.

రెమ్యునరేషన్ ముందుగానే తీసుకోవడంతో

రెమ్యునరేషన్ ముందుగానే తీసుకోవడంతో

రెమ్యునరేషన్ ముందుగానే తీసుకోవడంతో ఇచ్చిన కమిట్మెంట్ కు తప్పనిసరిగా న్యాయం చేయాల్సి వస్తోంది. అయినప్పటికీ విజయ్ సేతుపతి వీలైనంత వరకు మంచి సినిమాలు వస్తే అసలు వదులుకోవడం లేదు. మన తెలుగు ఇండస్ట్రీలో ఆయన మెల్లగా తన స్టార్ హోదాను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో పవర్ఫుల్ రోల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకోసం విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది.

సేతుపతి బెస్ట్ ఆల్ రౌండర్

సేతుపతి బెస్ట్ ఆల్ రౌండర్

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగా కూడా రానిస్తున్న విజయ్ సేతుపతి బెస్ట్ ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నాడు. ఈ రోజులలో ఎక్కువగా నటీనటులు ఫిట్నెస్ లేదా ఇతర స్కిల్స్ తో ఎక్కువగా అవకాశాలు అందుకుంటూ ఉంటారు.

కానీ విజయ్ సేతుపతి మాత్రం కేవలం తనకు ఉన్న బాడీ లాంగ్వేజ్ తోనే విభిన్నంగా నటిస్తూ ఎన్నో అవకాశాలు అందుకుంటున్నాడు. ఇక ఆ నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడు. స్టార్ హీరోలు కూడా అతనితో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఆ సినిమా విజయాల్లో కీలకపాత్ర

ఆ సినిమా విజయాల్లో కీలకపాత్ర

ఈ ఏడాది మొదట్లో వచ్చిన మాస్టర్ సినిమా విజయానికి ముఖ్య కారణం విజయ్ సేతుపతి అని చెప్పవచ్చు. సినిమాకు అతని పాత్ర కూడా ఎంతగానో ఉపయోగపడింది. అలాగే ఆ సినిమా తెలుగులో కూడా మంచి వసూళ్లను అందుకుందంటే అందుకు ఈ టాలెంట్ యాక్టర్ కూడా మరో కారణం అని చెప్పవచ్చు. వీలైనంత వరకు తెలుగులో మంచి ఆఫర్ వస్తే విజయ్ సేతుపతి ఏ మాత్రం వదులుకోవడం లేదు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించి తెలుగువారికి ఎంతగానో దగ్గరయ్యాడు. ఇక ఆ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలో ఒక ప్రత్యేకమైన విలనిజం చూపించాడు. ఆ సినిమా విషయంలో కూడా సేతుపతి పాత్ర ఎంతగానో హెల్ప్ అయ్యింది.

ఉప్పెన ఎఫెక్ట్..

ఉప్పెన ఎఫెక్ట్..

అంతకు ముందు వరకు కొన్ని తెలుగు సినిమాలను ఎక్కువగా రిజెక్ట్ చేసిన విజయ్ సేతుపతి ఉప్పెన హిట్ అయిన తర్వాత మాత్రం ఎలాంటి కథలు వచ్చినా కూడా ముందు స్క్రిప్ట్ వినడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక కథ నచ్చి అందులో ఆ పాత్ర అంతగా కనెక్ట్ కాకపోతే తనదైన శైలిలో సలహాలు కూడా ఇస్తున్నాడు. దర్శకులు కూడా విజయ్ సేతుపతిని ఒక్కసారి స్క్రిప్ట్ కోసం ఫిక్స్ చేసుకున్నారు అంటే అతన్ని తీసుకోవడానికి ఎంత దూరం అయినా వెళుతున్నారు. ఇక మరో టాలీవుడ్ దర్శకుడు కూడా బాలకృష్ణ సినిమా కోసం విజయ్ సేతుపతి ఇటీవల సంప్రదించినట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ సినిమాల్ పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ సినిమాల్ పవర్ఫుల్ రోల్

ఆ దర్శకుడు మరెవరో కాదు ఇటీవల క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని. ఈ దర్శకుడు బాలకృష్ణ మరొక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలు తెరకెక్కించనున్నాడు. మొత్తానికి సినిమా కథ అయితే పూర్తిగా సెట్ అయింది. బాలకృష్ణ కూడా గోపీచంద్ ఎప్పుడు నుంచో వర్క్ చేయాలని అనుకుంటున్నాడు. సెట్ అవడంతో మైత్రి మూవీ మేకర్స్ తో ఈ సినిమాను తెరపైకి తీసుకు రానున్నారు. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్ర కోసం ఇటీవల విజయ్ సేతుపతి సంప్రదించినట్లు తెలుస్తోంది.

Recommended Video

Adivi Sesh To Play AP Police Officer In HIT 2 | Nani | Vishwak Sen
రెమ్యునరేషన్ ఎంతంటే?

రెమ్యునరేషన్ ఎంతంటే?

విజయ్ సేతుపతి కూడా దర్శకుడు చెప్పిన పాత్రకు ఫిదా అయ్యాడట. డేట్స్ తప్పకుండా ఇస్తానని చెప్పాడట. కాకపోతే కొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఇక సినిమా కోసం రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. డేట్స్ ను బట్టి డైలీ పేమెంట్ లెక్కన దాదాపు 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక రెమ్యునరేషన్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదట. ఎంత ఇవ్వడానికైనా కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. చూస్తుంటే ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇటీవల సినిమా షూటింగ్ మొత్తం ఫినిష్ అయ్యింది. త్వరలోనే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాతో బాలయ్య బిజీ కానున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X