twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సేతుపతి తెలుగు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆ పనిలోనే ఉన్నాడట.. త్వరలో విశ్వరూపం !

    |

    నటుడు కావడానికి అష్టకష్టాలు పడి చివరికి హీరో స్థాయికి ఎదిగాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు సంపాదించాడు విజయ్ సేతుపతి. కంపెనీ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తనదైన నటనతో ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూ మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రల్లో నటిస్తూ విలన్ గా అవకాశాలు వచ్చినా కాదనకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ ఏడాది ఆయన విలన్ గా నటించిన ఉప్పెన సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిజానికి పిజ్జా అనే సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.

    యువ హీరోయిన్ గ్లామర్ ఫోటోషూట్.. లేత సొగసులను అలా దాచేస్తూ..

    ఉప్పెన ద్వారా దగ్గరై

    ఉప్పెన ద్వారా దగ్గరై

    అయితే తమిళంలో చాలా సినిమాల్లో నటించిన విజయ్ సేతుపతి తెలుగులో ఉప్పెన సినిమా ద్వారా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి ఉప్పెన సినిమా కంటే ముందు ఆయన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు. కానీ ఆ సినిమా మా లో ఆయనది చిన్న పాత్ర కావడంతో ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. ఇక ఉప్పెన సినిమా విషయానికి వస్తే మిగతా అన్ని సినిమాలలో విజయ్ సేతుపతి డబ్బింగ్ చెప్పిన వ్యక్తి కాకుండా ఉప్పెన సినిమాలో వేరే వ్యక్తి డబ్బింగ్ చెప్పడంతో ఆ వాయిస్ పెద్దగా ఆకట్టుకోలేదు.

    పూర్తిగా నేర్చుకున్నాక రచ్చ రచ్చే !

    పూర్తిగా నేర్చుకున్నాక రచ్చ రచ్చే !

    తాజాగా ఇదే అంశాన్ని విజయ్ సేతుపతి దృష్టికి తీసుకువెళ్లగా ఇకమీదట ఆ ఇబ్బందులు లేకుండా తానే తెలుగు నేర్చుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన తెలుగు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ నటుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను తెలుగు భాష నేర్చుకోవడం ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. అంతే కాదు ఒక్కసారి తెలుగు భాష మీద పట్టు సాధించానని తనకు అనిపిస్తే తెలుగులో మరిన్ని సినిమాలు అంగీకరించాలని అనుకుంటున్నానని సేతుపతి చెప్పుకొచ్చాడు. దీంతో ఇక ఆయన విశ్వరూపం చూపించడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.

    పుష్పలో మిస్ అయ్యి

    పుష్పలో మిస్ అయ్యి

    నిజానికి అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో కూడా ఆయన విలన్ పాత్రలో నటించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా కాల్షీట్స్ ఇబ్బందుల కారణంగా ఆయన విలన్ పాత్రలో నటించే లేకపోతున్నాడు. అయితే ఆయన పాత్రలో బాబీ సింహా నటిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది అయితే దీని మీద మాత్రం అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

    ఓటీటీకి తుగ్లక్ దర్బార్

    ఓటీటీకి తుగ్లక్ దర్బార్

    ఇక విజయ్ సేతుపతి నటించిన తుగ్లక్ దర్బార్ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా కోసం భారీ రేట్ వెచ్చించి మరీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ కొన్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి రెండు వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గా ట్రైలర్ లో క్లారిటీ వచ్చింది.

    English summary
    Tamil star Vijay Sethupathi has now gained a craze in Andhra Pradesh and Telangana. With the huge success of ‘Uppena’, the actor in a recent interview admitted that he has started learning the Telugu language. “I am learning the language. Once I get it fluently. I will sign more films,” he said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X