ఐటి రైడ్స్‌పై స్పందించిన స్టార్ హీరో!
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నివాసం, ఆఫీస్ పై ఇటీవల ఐటి దాడులు జరిగిన వార్త తమిళ సినీవర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై విజయ్ సేతుపతి తాజగా స్పందించాడు. విజయ్ సేతుపతి తాజాగా నటించిన చిత్రం 96. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా విజయ్ సేతుపతికి ఐటి రైడ్స్ గురించి ప్రశ్న ఎదురైంది.
ఐటి దాడుల వ్యవహారంలో బిజెపి నేత హెచ్ రాజా ప్రమేయం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయ్ సేతుపతి సెటైరికల్ గా స్పందించాడు. మా ఇంట్లోకి వచ్చి సర్వే చేస్తున్నాం అని చెప్పారు. కానీ బయట మాత్రం రైడ్ ని ప్రచారం జరుగుతోంది. ఇది కూడా మంచికే. ఎందుకంటే మంచి కంటే చెడు ప్రచారమే త్వరగా వ్యాపిస్తుందని విజయ్ సేతుపతి తెలిపాడు.

మన రాష్ట్రంలో కొంతమంది చెడు ప్రచారం తోనే ఎక్కువగా పబ్లిసిటీ పొందుతున్నారని విజయ్ సేతుపతి పరోక్షంగా హెచ్ రాజాని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలతో విజయ్ సేతుపతి,. రాజా మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతోందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











