శ్రీలంకన్ కాంట్రవర్సీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉప్పెన యాక్టర్
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి తెలుగు మూవీ ఉప్పెన సినిమాలో నటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో విజయ్ నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నాడు. హీరోగానే కాకుండా పాత్ర నచ్చితే సపోర్టింగ్ రోల్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నాడు. లాక్ డౌన్ అనంతరం మళ్ళీ ఈ హీరో ఎప్పటిలానే షూటింగ్స్ తో బిజీ అయ్యాడు.
నెక్స్ట్ విజయ్ సేతుపతి శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకకు తమిళ జనాలకు ఏ రేంజ్ లో వివాదాలు చెలరేగుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక శ్రీలంకలో తమిళ జనాలకు జరుగుతున్న అన్యాయలపై ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సారి ఆ వివాదాలను టార్గెట్ చేస్తూ వెంకట కృష్ణ అనే తమిళ్ దర్శకుడు ఒక సినిమా చేయబోతున్నాడు.

అయితే ఈ సినిమాలో నటించాడానికి కొంత మంది హీరోలు భయపడ్డారు. కాంట్రవర్సీ కథలో నటించడం ఎందుకు అని సైలెంట్ గా దర్శకుడికి నో చెప్పారట. అయితే విజయ్ సేతుపతి మాత్రం దర్శకుడి మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.


Click it and Unblock the Notifications











