Thalapathy 69: విజయ్ దళపతి చివరి సినిమా ఇదే.. ఎప్పుడు విడుదల కానుందంటే?

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి అందరికీ తెలిసిందే. ఆయన కేవలం తమిళంలోలనే కాకుండా తెలుగులోనూ అనేక మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన చేసే సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు అలా అనేక సినిమాలు వచ్చి తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పటి వరకు ఆయన మొత్తం 68సినిమాలు చేయగా.. తాజాగా 69వ సినిమా రాబోతుంది. అయితే ఇదే ఆయనకు చివరి సినిమా కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ్ దళపతి 69వ సినిమా కన్ఫార్మ్ అయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి టైటిల్ ఖరారు కాకపోవడంతో.. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే డైరెక్టర్ ఎవరు, హీరోయిన్, మిగతా నటీనీటులు ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ త్వరలోనే ఈ సినిమా సంబంధించిన పూర్తి వివరాలు తెలలిసే అవకాశం ఉంది. అలాగే ఇదే ఆయనకు చివరి సినిమా అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.

Vijay Thalapathy Last Film is his 69th movie Check Details

దళపతి 69 తర్వాత ఆయన సినిమాలు తీసే అవకాశం లేదని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అంటే.. ఆయన తాజాగా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఆయన ఏ పార్టీలోనూ చేరకుండా స్వయంగా పార్టీని పెట్టారు. తమిళగ వెట్రి కళగం అనే పేరుతో ఓ సరికొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ ద్వారానే తాను ఇకపై రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వివరించారు. ముఖ్యంగా అవినీతి నిర్మూళన కోసమే ఆయన పార్టీ పెట్టినట్లు తెలుస్తోంది.

తమిళనాడు సెంటిమెంట్ కలిసి వచ్చేలా తమిళ వెట్రి కళగం పేరును ఫిక్స్ చేసిన విజయ్ దళపతి పార్టీ పేరుకు అర్థం తమిళనాడు సక్సెస్ పార్టీ. వెట్రి అంటే విజయం, కళగం అంటే పార్టీ అనే అర్థం వస్తుంది. ప్రస్తుతం పార్టీ పేరును ప్రకటించిన ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయమని ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఏ పార్టీకీ మద్దతు ఇవ్వమని కూడా వివరించారు. త్వరలోనే తమ జెండా, ఎజెండా అనౌన్స్ చేస్తామని విజయ్‌ పేర్కొన్నారు.

Vijay Thalapathy Last Film is his 69th movie Check Details

2026లో జరిగే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ దళపతి ముందుకు వెళ్తున్నట్లు అర్థం అవుతోంది. ఈక్రమంలోనే ఆయన ఓ రెండు సినిమాలు చేసి ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల్లోనే ఉండాలని భావిస్తున్నారట. అందుకే దళపతి 69 సినిమాలు చేసి సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ను మార్చి, ఏప్రిల్ లో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X