Vijay 66: టైటిల్ తో అదిరిపోయే ఫస్ట్ లుక్ రిలీజ్.. తెలుగు టైటిల్ కు తగ్గట్టుగానే..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరో స్టైలిష్ సినిమాతో రాబోతున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 66వ సినిమా చేస్తున్న విజయ్ ఈసారి డైరెక్ట్ గా తెలుగులో కూడా బిగ్ హిట్ అందుకోవడానికి సిద్ధమయ్యాడు. విజయ్ ఇటీవల కాలంలో నటించిన కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ముఖ్యంగా మాస్టర్ సినిమా 10 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

ఆ తరువాత బీస్ట్ కూడా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసింది. కానీ ఆ సినిమా సక్సెస్ అయి ఉంటే తెలుగులో విజయ్ మార్కెట్ మరింత పెరిగి ఉండేది. కానీ ఆ సినిమా తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ఇక తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా డిజాస్టర్ గా నిలిచింది. అయితే తదుపరి సినిమాతో విజయ్ ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని సిద్ధమవుతున్నాడు.

Vijay upcoming project tamil title varisu fixed and poster viral

ఇక బుధవారం రోజు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను విడుదల చేశారు. విజయ్ 66వ సినిమాకు తమిళంలో 'వారిసు' అనే టైటిల్ ను సెట్ చేశారు. ది బాస్ రిటర్న్స్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. సూటు బూటు వేసుకున్న విజయ్ మంచి బిజినెస్ మెన్ లా కనిపిస్తున్నాడు. విజయ్ ఫ్యాన్స్ కు అయితే ఈ సినిమా టైటిల్ అలాగే విజయ్ స్టైలిష్ లుక్ అద్భుతంగా నచ్చేసింది.

ఇక సినిమాకి సంబంధించిన తెలుగు టైటిల్ ను రేపు ఎనౌన్స్ చేయనున్నారు. వారసుడు అనే టైటిల్ అనుకుంటున్నట్లు ఇదివరకే ఒక టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు తమిళ్ టైటిల్ పై క్లారిటీ ఇవ్వడంతో దాదాపు అదే ఫిక్స్ అని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఫ్యాన్స్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉంటాయని టాక్ వస్తోంది. ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా రష్మిక మందన్న మేయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X