Balakrishna: అవే నాకు రెండు కళ్లు.. బాలయ్య ఫేవరెట్ హీరోయిన్లు ఎవరో తెలుసా..

Balakrishna: పద్మ భూషణ్, నటసింహం నందమూరి బాలకృష్ణ.. పాత్ర ఏదైనా.. కథలోనైనా ఇట్టే ఒదిగిపోయే గొప్ప నటుడు బాలకృష్ణ. నటించేది ఏ పాత్ర అయినా నూటికి నూరు శాతం న్యాయం చేసే అతికొద్దిమంది నటులలో బాలయ్య ఒకడు. నందమూరి తారక రామారావు నట వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ.. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లలో నటించి మెప్పించారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నేటీకి కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ.. టాలీవుడ్ లో టాప్ హీరోగా రాణిస్తున్నాడు. అయితే.. ఆయన తన 50 ఏళ్ల నట ప్రస్థానంలో ఎంతో మంది హీరోయిన్స్ తో నటించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలో నటించిన బాలయ్య ఫెవరేట్ హీరోయిన్స్ ఎవరో తెలుసా!

నందమూరి బాలకృష్ణ.. పద్నాలుగేళ్ళ వయసులో 'తాతమ్మ కల' అనే సినిమాతో తెలుగు సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టాడు. మొదట్లో పలు సినిమాల్లో సహాయ నటుడిగా నటించి మెప్పించారు. 'సాహసమే జీవితం' అనే సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా నటించి, తండ్రికి తగ్గ వారసుడిగా మెప్పించాడు. బాలయ్య తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. మెయిన్ గా బాలయ్య డైలాగ్స్ వింటుంటే గూస్ బంప్స్ రావాల్సిందే. ఆయన కంటి చూపుతో చంపేస్తానన్న.. ఒంటి చేత్తో వందమందిని నరికేసినా.. లేదా తొడ కొడితే.. సుమోలు గాలిలోకి ఎగిరినా .. ప్రేక్షకులు బాలయ్యను అంగీకరిస్తారు. ఏ సినిమా చేసిన రికార్డుల వర్షం కురిపించడానికి ఆయన అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు.

Vijayashanthi Ramya Krishna Simran quoting them as Balakrishna favourite Actresses

ఇప్పటికి కూడా బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సంక్రాంతి కానుక వచ్చిన డాకు మహారాజ్ హీట్ కొట్టడంతో వరుసగా నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే.. తాజాగా నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా హైదరాబాద్ శివారులోని చంద్రబాబు ఫార్మ్ హౌస్ లో బాలయ్యకు పద్మ భూషణ్ వరించిన నేపథ్యంలో భువనేశ్వరి పార్టీ ఇచ్చారు. పార్టీలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

ఈ కార్యక్రమంలో హీరో బాలయ్య ను తన సోదరి భువనేశ్వరి ఆటపట్టించింది. 'నీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు?' బాలయ్య అని అడిగింది. దీంతో బాలయ్య ఇరకాటంలో పడ్డాడు. మొదట తన భార్య వసుంధర పేరు చెప్పాడు. కానీ, చెప్పాలని భువనేశ్వరి గట్టిగా వాదించడంతో తన టాప్ 3 ఫేవరేట్ హీరోయిన్స్ పేరు చెప్పేశాడు.బాలకృష్ణ తన సినిమాల్లోని హీరోయిన్లతో మంచి సత్సంబంధాలను కొనసాగిస్తాడు. కానీ, వందకు పైగా సినిమాల్లో నటించిన బాలకృష్ణ.. తన కెరీర్లో 17 సినిమాల్లో హీరోయిన్ గా విజయశాంతి తన ఫస్ట్ ఫెవరేట్ హీరోయిన్ అని చెప్పాడు.

Vijayashanthi Ramya Krishna Simran quoting them as Balakrishna favourite Actresses

వీరిద్దరూ కాంబోలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు.. సెన్సేషనల్, సూపర్ హిట్ మూవీస్సే.. అందులో .. కథానాయకుడు, పట్టాభిషేకం, ముద్దుల క్రిష్ణయ్య, దేశోద్ధారకుడు, అపూర్వ సహోదరులు, భార్గవ రాముడు, మువ్వగోపాలుడు, భానుమతి గారి మొగుడు, భలే దొంగ, ముద్దుల మావయ్య.. వంటి సినిమాలు సెన్సేషన్ హిట్ గా నిలిచాయి. తన సెకండ్ ఫెవరేట్ హీరోయిన్ రమ్యకృష్ణ అనీ, మూడో ఫేవరెట్ హీరోయిన్ సిమ్రాన్ అని బాలయ్య చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాలయ్య చెప్పిన ఫేవరెట్ హీరోయిన్ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అలాగే.. బాలయ్య కు, మ్యాన్షన్ హౌజ్ కు వీడదీయారని సంబంధం ఉన్న విషయం తెలిసిందే. బాలయ్య తాగే బ్రాండ్ కూడా మ్యాన్షన్ హౌజ్ అని టాక్.. బాలయ్య కూడా డైరెక్ట్ గానే దాని గురించి మాట్లాడారు. అయితే.. నారా భువనేశ్వరి ఈ విషయం గురించి కూడా అడిగింది. 'నీకు మ్యాన్షన్ హౌజ్ కి సంబంధం ఏంటి? వసుంధర కంటే మ్యాన్షన్ హౌజ్ ఎక్కువయిపోయిందా? ఎప్పుడూ చంకలో పెట్టుకొని తిరుగుతావా? అని బాలయ్యను అడిగేసింది భువనేశ్వరి.

ఈ ప్రశ్నకు బాలయ్య కూడా అంతే .. ఆసక్తిగా బదులిచ్చారు. ' నా లైఫ్ లో అన్ని యాదృచ్ఛికంగానే జరిగాయి. మ్యాన్షన్ హౌజ్ కూడా అలవాటు అయింది. అంతేకానీ, దానికి నాకు స్పెషల్ అనుబంధమేమి లేదు. అదే నన్ను ప్రేమించింది. వసుంధర, మ్యాన్షన్ హౌజ్ నాకు రెండు కళ్ళు. నా హౌస్ లో మ్యాన్షన్ హౌజ్ ఉంటుంది' అంటూ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం బాలయ్య మ్యాన్షన్ హౌజ్ సమాధానం వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X