twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైతు కోసం ప్రేమ కథ సిద్ధం చేసిన విజయేంద్ర ప్రసాద్!

    |

    అక్కినేని నాగ చైతన్య అప్పుడప్పుడూ కొన్ని విజయాలు అందుకుంటున్నాడు. కానీ వెంటనే పరాజయాలతో డీలా పడుతున్నాడు. కెరీర్ కు జోష్ నిచ్చే సరైన విజయం చైతుకు దక్కడం లేదు. చైతు కెరీర్ పై దృష్టి పెట్టిన నాగార్జున ఇటీవల బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ తో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. చైతు కోసం మంచి కథ సిద్ధం చేయాలని నాగ్ రిక్వస్ట్ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

    నాగార్జున ప్రయత్నంలో ముందడుగు పడింది. విజయేంద్ర ప్రసాద్ నాగ చైతన్య కోసం అదిరిపోయే ప్రేమ కథ సిద్ధం చేశాయని సమాచారం. ఈ కథని సరిగ్గా చేయగలిగే దర్శకుడి కోసం చైతు వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు, ఏ బ్యానర్ లో నిర్మించబోతున్నారు అనే వివరాలు తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

    Vijayendra Prasad Pens love story for Akkineni Naga Chaitanya

    ఇదిలా ఉండగా నాగ చైతన్య శివ నిర్వాణ దర్వకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. వివాహం జరిగిన తరువాత చైతు, సమంత కలసి నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రానికి మజిలీ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా విక్టరీ వెంకటేష్ తో క్రేజీ మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు చైతు సిద్ధం అవుతున్నాడు. జైలవకుశ దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ వెంకీ మామ.

    English summary
    Vijayendra Prasad Pens love story for Akkineni Naga Chaitanya. here is the full details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X