బర్త్ డే స్పెషల్: చియాన్ విక్రమ్ కిరాక్ లుక్, మేకింగ్ వీడియో కేక!

Recommended Video

Vikram's 53 rd Birthday Special Making Video Of Kadaram Kondan Released || Filmibeat Telugu

సౌత్ స్టార్ చియాన్ విక్రమ్ బుధవారం 53వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తమిళ యాక్షన్ థ్రిల్లర్ 'కడరమ్ కొండన్' మూవీలో ఆయన లుక్‌కు సంబంధించి స్పెషల్ మేకంగ్ వీడియో విడుదల చేశారు. దర్వకుడు రాజేష్ ఎం సెల్వ తన ట్విట్టర్ ద్వారా విక్రమ్‌ను విష్ చేస్తూ ఈ వీడియో విడుదల చేశారు.

సినిమా సినిమాకు తన లుక్ పూర్తిగా మార్చేసే విక్రమ్.. 'కడరమ్ కొండన్' మూవీలో సరికొత్త స్టైలిష్ లుక్‌తో అభిమానులను అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బేనర్లో కమల్ హాసన్ నిర్మిస్తుండటం విశేషం.

విక్రమ్ లుక్

ఈ చిత్రంలో విక్రమ్ కెకె అనే పాత్రలో కనిపించబోతున్నారు. విక్రమ్ కెరీర్లోనే ఒక విభిన్నమైన యాక్షన్ మూవీ అవుతుందని చిత్ర బృందం చెబుతోంది. అయితే ఈచిత్రంలో విక్రమ్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నారనే విషయాలు బయటకు రాలేదు.

ఫిదా అవుతున్న ఫ్యాన్స్

ఫిదా అవుతున్న ఫ్యాన్స్

తాజాగా రిలీజ్ చేసిన చియాన్ లుక్ మేకింగ్ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ కనిపించనంత స్టైలిష్‌గా డిఫరెంట్ మేకోవర్‌తో విక్రమ్ ఎంట్రీ ఉండబోతోంది. అతడి న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

కడరమ్ కొండన్

కడరమ్ కొండన్

‘కడరమ్ కొండన్' చిత్రాన్ని ఎక్కువగా మలేషియాలో చిత్రీకరించారు. ఇందులో ఇంకా అక్షర హాసన్, పూజా కుమార్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్ కమల్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న 45వ సినిమా ఇది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

విక్రమ్ నెక్ట్స్ మూవీ

విక్రమ్ నెక్ట్స్ మూవీ

ఈ సినిమా పూర్తయిన తర్వాత విక్రమ్ తన నెక్ట్స్ మూవీ ‘మహావీర్ కర్ణ' చిత్రంలో బిజీ కాబోతున్నారు. ఈ మూవీని రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దర్వకుడు ఆర్ఎస్ విమల్ ఈ పీరియడ్ డ్రామాను హ్యాండిల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X