రాంచరణ్, బోయపాటి సినిమా.. ఎవరూ ఊహించని విధంగా టైటిల్!
Recommended Video

మెగా పవర్ స్టార్ రాంచరణ్, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ యాక్షన్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రంగస్థలం వంటి భారీ విజయం తరువాత రాంచరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. బోయపాటి శ్రీను ఇంత వరకు టైటిల్ కూడా ప్రకటించకపోవడంతో, ఫాన్స్ ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాంచరణ్ సినిమా టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

చిరు, పవన్ కలయికలో
సినిమా ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా బోయపాటి శ్రీను ఫస్ట్ లుక్ విడుదల చేయలేదు. పవన్ కళ్యాణ్, చిరంజీవి చిత్రాల కలయికలో టైటిల్ పరిశీలిస్తున్నారనే వార్తలు వినిపించాయి. తాజాగా ఈ చిత్రానికి ఎవరూ ఊహించని విధంగా బోయపాటి శ్రీను క్లాస్ టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది.

క్లాస్ టైటిల్
బోయపాటి, రాంచరణ్ చిత్రానికి 'వినయ విధేయ రామ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఫిలిం ఛాంబర్ లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారట. దీనితో వినయ విధేయ రామ అనే టైటిల్ ట్రెండింగ్ గా మారింది. మాస్ చిత్రాలు తెరకెక్కించే బోయపాటి క్లాస్ టైటిల్ రిజిస్టర్ చేయించడంతో ఆసక్తిగా మారింది.

రౌడీ తమ్ముడు కూడా
వినయ విధేయ రామ మాత్రమే కాదు. రౌడీ తమ్ముడు అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి. దసరాకు ఫస్ట్ లుక్ విడుదల కానుంది అని వార్తలు వస్తున్న తరుణంలో రాంచరణ్ సినిమా టైటిల్ ఈ రెండింటిలో ఏదో అప్పుడే తేలనుంది.

సంక్రాంతి కానుకగా
ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఆర్యన్ రాజేష్, స్నేహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్.


Click it and Unblock the Notifications











