హీరో విశాల్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది!
సౌత్ సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజాలు మ్రోగుతున్నాయి. రెండు రోజుల క్రితమే తమిళ స్టార్ ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్ పెళ్లి చేసుకోగా.. త్వరలో విశాల్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన అనీషా రెడ్డిని విశాల్ పెళ్లాడబోతున్నారు.
అనీషా రెడ్డితో పెళ్లి విషయాన్ని విశాల్ జనవరిలో అఫీషియల్‌గా ప్రకటించాడు. అంతకు ముందు తన పెళ్లి వార్తలను తోసి పుచ్చుతూ వచ్చిన విశాల్.... అనీషా రెడ్డి ఇన్‌స్టా పోస్ట్‌తో మ్యాటర్ లీక్ అవ్వడంతో అసలు విషయం ఒప్పుకోక తప్పలేదు.

ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలలోనే విశాల్-అనీషా నిశ్చితార్థం జరుగబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి 16న ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారని, హైదరాబాద్‌లో ఈ వేడుక జరుగుతుందని సమాచారం.

అనీషా రెడ్డి
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త విజయ్ రెడ్డి, పద్మజ దంపతుల కుమార్తె అనిషా. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘పెళ్లి చూపులు', ‘అర్జున్ రెడ్డి' చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ఇద్దరూ సినిమా రంగానికి చెందిన వారే కావడంతో ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు.

పెళ్లి ఎప్పుడు?
నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విశాల్ సంస్థ భవన నిర్మాణం పూర్తికాకుండా పెళ్లి చేసుకోను అని గతంలో ప్రకటించారు. బిల్డింగ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఆగస్టులో పెళ్లి జరిగే అవకాశం ఉందని గతంలో విశాల్ చెప్పినప్పటికీ.. అంతకంటే ముందుగానే డేట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది.

విశాల్
విశాల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘అయోగ్య' అనే చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన టెంపర్ చిత్రానికి రీమేక్. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్. ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











