Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విశాల్ మరో ప్రయోగం.. ఆకట్టుకుంటోన్న ‘చక్ర’ ఫస్ట్ లుక్
తెలుగు మూలాలు ఉన్న విశాల్ ఓ తమిళ హీరోనే అయినా.. టాలీవుడ్‌లోనూ సరిసమాన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. విభిన్నకథకథనాలకు ప్రాముఖ్యతనిచ్చే విశాల్.. మరో ప్రయోగంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తుప్పరివాలన్ (డిటెక్టివ్), అభిమన్యు (ఇరుంబుదురై), అయోగ్య, పందెంకోడి 2 వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించాడు.
ప్రస్తుతం విశాల్ చేయబోయే ప్రాజెక్ట్లపైన అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అంతేకాకుండా దర్శకుడు మిస్కిన్‌తో జరిగిన గొడవ, డిటెక్టివ్ 2 చిత్రం నుంచి ఆయన్ను తప్పించడం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. నిర్మాత, దర్శకుల మధ్య వచ్చే ఇగోలు, బడ్జెట్ పరిమితుల వల్ల విశాల్, మిస్కిన్లకు దూరం పెరిగింది. దీంతో మిస్కిన్‌ను ప్రాజెక్ట్నుంచి తప్పించడం, దర్శకత్వ బాధ్యతలను విశాల్ చేపట్టడం జరగిన సంగతి తెలిసిందే.
విశాల్ ఆ సినిమా బాధ్యతలతో పాటు మరో ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తున్నాడు. ఎంఎస్ ఆనందన్ అనే దర్శకుడితో చక్ర అనే కొత్త సినిమాను చేస్తున్నాడు. దానికి సంబంధిచిన ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. నేటి సాయంత్రం ఐదు గంటలకు ట్రైలర్ గ్లింప్సస్ను వదులుతున్నట్టు తెలిపారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.