twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశాల్ మరో ప్రయోగం.. ఆకట్టుకుంటోన్న ‘చక్ర’ ఫస్ట్ లుక్

    |

    తెలుగు మూలాలు ఉన్న విశాల్ ఓ తమిళ హీరోనే అయినా.. టాలీవుడ్‌లోనూ సరిసమాన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. విభిన్నకథకథనాలకు ప్రాముఖ్యతనిచ్చే విశాల్.. మరో ప్రయోగంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తుప్పరివాలన్ (డిటెక్టివ్), అభిమన్యు (ఇరుంబుదురై), అయోగ్య, పందెంకోడి 2 వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించాడు.

    ప్రస్తుతం విశాల్ చేయబోయే ప్రాజెక్ట్‌లపైన అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అంతేకాకుండా దర్శకుడు మిస్కిన్‌తో జరిగిన గొడవ, డిటెక్టివ్ 2 చిత్రం నుంచి ఆయన్ను తప్పించడం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. నిర్మాత, దర్శకుల మధ్య వచ్చే ఇగోలు, బడ్జెట్ పరిమితుల వల్ల విశాల్, మిస్కిన్‌లకు దూరం పెరిగింది. దీంతో మిస్కిన్‌ను ప్రాజెక్ట్నుంచి తప్పించడం, దర్శకత్వ బాధ్యతలను విశాల్ చేపట్టడం జరగిన సంగతి తెలిసిందే.

    Vishal Chakra First Look Out

    విశాల్ ఆ సినిమా బాధ్యతలతో పాటు మరో ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తున్నాడు. ఎంఎస్ ఆనందన్ అనే దర్శకుడితో చక్ర అనే కొత్త సినిమాను చేస్తున్నాడు. దానికి సంబంధిచిన ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. నేటి సాయంత్రం ఐదు గంటలకు ట్రైలర్ గ్లింప్సస్‌ను వదులుతున్నట్టు తెలిపారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

    English summary
    Vishal Chakra First Look Out. Here we go, Presenting the Title & First Look of my next in Telugu, #vishalChakra. ReginaCassandra AndShraddhaSrinath Are Female leads.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X