కీర్తి సురేష్‌పై విశాల్ ఫిదా.. ఆ సినిమా తీస్తే ఆమెనే హీరోయిన్!

2005లో విడుదలైన చిత్రం 'పందెంకోడి' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ హిట్‌ కాంబినేషన్‌లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'పందెంకోడి 2' రూపొందుతోంది. ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిలిమ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై తెరకెక్కుతోన్న ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 18న విడుదల చేయనున్నారు. విశాల్‌ నటించిన 25వ చిత్రం 'పందెంకోడి 2'. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఏషియన్‌ ఫిలింస్‌ అధినేత నారాయణదాస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

 నన్ను హీరోగా నిలబెట్టిన వ్యక్తి

నన్ను హీరోగా నిలబెట్టిన వ్యక్తి

మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ - ''ఇండస్ట్రీలోకి వచ్చి `పందెంకోడి 2`తో పాతిక సినిమాలు పూర్త‌య్యాయి. నేను ఈరోజు ఇలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం ముందు తల్లిదండ్రులు. మా అన్నయ్య విశాల్‌ కృష్ణ. వారి ప్రోత్సాహంతోనే హీరోగా కెరీర్‌ను ప్రారంభించాను. 'పందెంకోడి'తో తమిళంలో సక్సెస్‌ కాగానే తెలుగు రీమేక్‌ కోసం చాలా మంది నిర్మాతలు వచ్చి అడిగినా నాన్నగారు ఒప్పుకోకుండా తెలుగులో రిలీజ్‌ చేసి సక్సెస్‌ను ఇచ్చి నన్ను ఇక్కడ కూడా హీరోగా నిలబెట్టారు.

 మంచి కంటెంట్ ఉంటే

మంచి కంటెంట్ ఉంటే

మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు నన్ను ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు. వారందరికీ థాంక్స్‌. ఈ ప్రయాణంలో ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించాలనే కష్టపడ్డాను. ప్రతి సినిమాలో గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులతో పనిచేశాను.

 నేను యాక్షన్ హీరోగా

నేను యాక్షన్ హీరోగా

లింగుస్వామి 'పందెంకోడి' సినిమాతో యాక్షన్‌ హీరోని చేశారు. అలాగే నాతో చాలా మంది నిర్మాతలు పనిచేశారు. నిర్మాతలు సినిమాకు ఊపిరిలాంటోళ్లు. 'పందెంకోడి 2' సినిమా విషయానికి వస్తే...13 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్‌. మేకింగ్‌ పరంగా నెక్స్‌ట్‌ లెవల్‌లో ఉండే సినిమా. ఏడురోజుల పాటు జరిగే జాతర నేపథ్యంలో సీక్వెల్‌ ఉంటుంది. యువన్‌ శంకర్‌ రాజా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చాడు. లైకా ప్రొడక్షన్స్‌, జయంతి లాల్‌ గడ, తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న ఠాగూర్‌ మధుగారికి థాంక్స్‌. తెలుగు, తమిళంలో సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్‌ 18న విడుదల చేస్తున్నాం.

 దేవుడే ఈ సినిమా చేయించాడేమో

దేవుడే ఈ సినిమా చేయించాడేమో

లింగుస్వామితో ఆ స్వామి (దేవుడు) రెండో సినిమాగా పందెంకోడి చేయించాడు. ఇప్పుడు మళ్లీ 25వ సినిమా చేయించాడు. మహానటితో జాతీయ అవార్డు గెలుచుకునే స్థాయిలో గొప్ప నటనను కనపరిచిన కీర్తి సురేశ్‌ మా సినిమాలో మరో అద్భుతమైన పాత్రను పోషించింది. ఈ సినిమాతో తను యాక్షన్‌ సన్నివేశాలతో కూడా ఆకట్టుకుంటుంది.

పందెంకోడి పార్ట్‌ 3 చేస్తే

పందెంకోడి పార్ట్‌ 3 చేస్తే

పందెంకోడి పార్ట్‌ 3 చేస్తే అందులో కూడా కీర్తి సురేశ్‌నే హీరోయిన్‌గా తీసుకోవాలనిపించింది. తను అంత బాగా నటించింది. ఇక వరలక్ష్మి పాత్ర సినిమా తర్వాత అందరికీ గుర్తుండిపోతుంది. అలాగే రాజ్‌కిరణ్‌గారు హుందా పాత్రలో మళ్లీ చక్కగా నటించారు. అందరూ గుర్తుకు వచ్చిన తర్వాతే ప్రేక్షకులకు నా పాత్ర గుర్తుకు వచ్చేంత గొప్పగా అందరూ నటించారు. తెలుగులో సినిమాను గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్న ఠాగూర్‌ మధుగారికి థాంక్స్‌'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X