8 ఏళ్ల చిన్నారి ఆపరేషన్‌కు విశాల్ సాయం.. విజయవంతంగా!
సినీ హీరో విశాల్ కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా తన దృష్టికి వచ్చిన ప్రతి అంశంపై స్పందిస్తుంటాడు. విశాల్ అందించిన సాయంతో 8 ఏళ్ళ చిన్నారి జీవితం నిలబడింది. కడపకు చెందిన అయేషా అనే చిన్నారి కాలేయవ్యాధితో బాధపడుతోంది. చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు కాలేయ మార్పిడి చేయాలనీ, 25 లక్షలు ఖర్చు అవుతుందని తేల్చారు.
కడప జిల్లాకు చెందిన హుస్సేన్ దంపతులు అయేషాని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. 25 లక్షల ఖర్చు చేసే స్థోమత వారికి లేదు. దీనితో పాప వైద్యం కోసం దాతలని ఆశ్రయించారు. చాలామంది దాతలు తమకు తోచిన విధంగా సాయం చేశారు. పాపా గురించి విశాల్ చెవిన పడడంతో వెంటనే స్పందించి ఆర్థిక సాయం చేశాడు.

దీనితో చిన్నారి కాలేయ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. అయేషా జీవితంలో ఎలాంటి అవరోధాలు లేకుండా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విశాల్ ఆకాంక్షించాడు. విశాల్ ఈ ఏడాది అభిమన్యుడు, పందెం కోడి 2 చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











