షూటింగులో హీరో విశాల్‌కు తీవ్రగాయాలు, ఆందోళనలో కాబోయే భార్య!
Recommended Video

హీరో విశాల్ సినిమా షూటింగులో తీవ్రంగా గాయపడ్డారు. యాక్షన్ సీన్స్ చేస్తుండగా ఎడమ చేతికి, కాలుకు గాయాలయ్యాయి. టర్కీలోని కాప్పడోసియా అనే ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
గాయపడిన విశాల్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. స్థానిక వైద్యలు చికిత్స అనంతరం అతడి చేయి, కాలుకు కట్టుకట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

పూర్తిగా కోలుకోకుండానే...
విశాల్ నటించిన ‘అయోగ్య' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా విశాల్ గాయపడ్డారు. ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోకుండానే తన తర్వాతి సినిమా కోసం టర్కీ వెళ్లి యాక్షన్ సీక్వన్స్‌లో నటిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

బైక్ అదుపుతప్పి కింద పడిపోయిన విశాల్
ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైడెంట్ ఆర్ట్స్ బేనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం టర్కీలో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, ఛేజింగ్ సీన్లు చిత్రీకరిస్తుండగా విశాల్ బైక్ రైడ్ చేస్తూ అదుతప్పి పడిపోయాడు.

ఆందోళనలో కాబోయే భార్య
విశాల్ త్వరలో హైదరాబాద్ అమ్మాయిని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు నటి ఆళ్ల అనిశారెడ్డితో అతడి ఎగేజ్మెంట్ వేడుక మార్చి 16 జరిగింది. విశాల్ గాయపడ్డ విషయం తెలిసి అనిశారెడ్డి ఆందోళన చెందిందని, వెంటనే టర్కీ వెళ్లేందుకు ప్రయత్నించిందని, అంతగా ఆందోళన చెందాల్సిన గాయం కాదంటూ ఆమెను విశాల్ నిలువరించినట్లు తెలుస్తోంది.

విశాల్-అనిశా వివాహం ఎప్పుడంటే?
నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విశాల్... సంస్థ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకొంటానని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. భవన నిర్మాణం చివరి దశలో ఉంది. ఆగస్టులోపే వీరి వివాహం జరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











