విశాల్ పెళ్లి డేట్ ఫిక్స్... నా నిర్ణయంలో మార్పు లేదు.. గుట్టుచప్పుడుగా అఫైర్!
తెలుగులో వర్ధమాన నటి అనిషా ఆల్ల రెడ్డితో పెళ్లి అంటూ విశాల్ చేసిన ప్రకటనకు మీడియాలో బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానులు తమదైన రీతిలో స్పందించారు. చెన్నైలో నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శిగా విశాల్ ఈ వార్తను బయటపెట్టారు. గతంలో నడిగర సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే నా పెళ్లి అంటూ విశాల్ ఒట్టు పెట్టుకొన్న సంగతి తెలిసిందే. తన పెళ్లి వార్త గురించి మీడియాతో మాట్లాడుతూ..

ఆగస్టులోనే పెళ్లి
నడిగర సంఘం భవన నిర్మాణం పూర్తికాకుండా నేను పెళ్లి చేసుకొనని నేను గతంలో చెప్పాను. భవన నిర్మాణం పూర్తి కావొచ్చింది. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. నా పెళ్లి బహుశా ఆగస్టులో చెన్నైలో జరుగుతుంది అని విశాల్ చెప్పాడు.

మాది ప్రేమ వివాహమే
అనిషా కుటుంబం, మా కుటుంబం హైదరాబాద్‌లో కలిశారు. మా ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లారు. నా పెళ్లి వార్త బయటకు రాగానే అందరూ పెద్దలు కుదిర్చిన వివాహం అనుకొన్నారు. కానీ మాది ప్రేమ వివాహం. చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. ఒకరిని ఒకరం అర్థం చేసుకొన్నాం. నా అఫైర్ గురించి ఇండస్ట్రీలో కొంతమందికే తెలుసు అని విశాల్ వెల్లడించాడు.

నా ప్రేమకు గ్రీన్ సిగ్నల్
నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆమె పేరు అనిషా ఆళ్ల. నా ప్రేమకు ఆమె ఒకే చెప్పింది. మా పెళ్లి వార్త నిజమని ధ్రువీకరిస్తున్నాను. నా జీవితం మలుపు తిప్పే తేదీని త్వరలోనే ప్రకటిస్తాను. కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్‌మెంట్ జరిగింది. అని విశాల్ ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అనిషా రెడ్డి ఎవరంటే
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త విజయ్ రెడ్డి, పద్మజ దంపతుల కుమార్తె అనిషా. ఇటీవల విడుదలైన అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు చిత్రంలో చిన్న పాత్రల్లో నటించింది. విశాల్ ప్రకటన తర్వాత తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో ఫొటోలను పోస్ట్ చేసింది.

టెంపర్ మూవీ రీమేక్‌లో
వరుస విజయాలతో దూసుకెళ్తున్న విశాల్ ప్రస్తుతం టెంపర్ రీమేక్‌లో నటిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ పోషించిన పోలీస్ అధికారి పాత్రలో విశాల్ కనిపిస్తాడు. ఆయోగ్య టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయిక. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానున్నది.


Click it and Unblock the Notifications











