twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజం ఒప్పుకున్న విశాల్... ఆమెతో పెళ్లి గురించి అఫీషియల్ ప్రకటన!

    |

    నిన్న మొన్నటి వరకు తన పెళ్లి గురించి వస్తున్న వార్తలను తోసి పుచ్చుతూ వస్తున్న హీరో విశాల్ ఎట్టకేలకు అసలు విషయం వెల్లడించారు. త్వరలో అనీషా రెడ్డిని పెళ్లాడబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన అఫీషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా అనీషాతో దిగిన ఫోటోను షేర్ చేశారు.

    వాస్తవానికి కొన్ని రోజుల క్రితమే విశాల్-అనీషా పెళ్లి విషయం బయటకు లీకైంది. అయితే అలాంటి దేమీ అదంటూ బుకాయిస్తూ వచ్చాడు ఈ తమిళ స్టార్. అయితే సంక్రాంతి సందర్భంగా అనీషా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా విశాల్‌తో పెళ్లి విషయం ప్రకటించడంతో... విశాల్ కూడా ఈ విషయంలో ఓపెన్ అయ్యారు.

    నిజం ఒప్పుకున్న విశాల్, పెళ్లి విషయం ట్విట్టర్ ద్వారా...

    నిన్న మొన్నటి వరకు తన పెళ్లి వార్తలను ఖండిస్తూ వచ్చిన విశాల్ ఎట్టకేలకు అసలు విషయం ఒప్పుకున్నారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అనీషా తన లైఫ్‌లోకి రావడం పట్ల హ్యాపీగా ఉన్నట్లు వెల్లడించారు. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదని, త్వరలో ప్రకటిస్తామన్నారు.

    విశాల్ గురించి అనీషా

    విశాల్ గురించి అనీషా

    విశాల్‌ను పెళ్లాడబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన అనీషా రెడ్డి... ‘విశాల్ రూపంలో తనకు మంచి జీవిత భాగస్వామి దొరికాడని, అతడి మంచి మనసు ఎంతో నచ్చిందని, విశాల్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన్ను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను' అని వ్యాఖ్యానించారు.

    <strong>అర్జున్ రెడ్డి మూవీ నటితో.... విశాల్ వివాహం, అనీషా రెడ్డి ఇన్‌స్టా పోస్ట్ హాట్ టాపిక్!</strong>అర్జున్ రెడ్డి మూవీ నటితో.... విశాల్ వివాహం, అనీషా రెడ్డి ఇన్‌స్టా పోస్ట్ హాట్ టాపిక్!

    రెండు మూడు నెలల్లో నిశ్చితార్థం, పెళ్లి

    రెండు మూడు నెలల్లో నిశ్చితార్థం, పెళ్లి

    ఈ సంవత్సరమే వీరి పెళ్లి జరుగుతుందని విశాల్ తండ్రి జిరె రెడ్డి తెలిపారు. త్వరలోనే ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించనున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి డేట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనీషా రెడ్డి హైదరాబాద్‌లోని బిజినెస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడే వివాహం జరిగే అవకాశం ఉంది.

    ఆమె కూడా సినిమా రంగంలో...

    ఆమె కూడా సినిమా రంగంలో...

    అనీషా రెడ్డి... విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘పెళ్లి చూపులు', ‘అర్జున్ రెడ్డి' చిత్రాల్లో నటించింది. సినిమా రంగానికి చెంది అమ్మాయి కావడంతో తనను అర్థం చేసుకుంటుందనే నమ్మకంతో ఉన్నారట విశాల్. ప్రస్తుతం విశాల్ ‘అయోగ్య' అనే చిత్రంలో నటిస్తున్నారు.

    English summary
    Actor Vishal confirmed his wedding news. After Anisha's post went viral, Vishal on Wednesday added on his verified Twitter page: "Yes... happy... too happy... happiest. Her name's #AnishaAlla. And yes, she said, 'Yes.' And it's confirmed. My next biggest transition in life. Will be announcing the date soon. God bless."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X