For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vishal: జగన్‌కు హ్యాట్సాఫ్.. స్టాలిన్ కూడా ఫాలో అవ్వాలి.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ట్వీట్!

  |

  ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల అమ్మకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ తయారు చేయడానికి తెలిసిందే. ఈ మేరకు చేస్తుందని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ వెబ్ సైట్ ను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుందని కూడా జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే దీని గురించి ఇప్పటిదాకా ఒకరిద్దరు తప్ప సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందించిన దాఖలాలు లేవు. ఈ అంశం మీద తమిళ హీరో విశాల్ స్పందన ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  అసలు ఏమైందంటే

  అసలు ఏమైందంటే

  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టెక్కెట్లను కూడా ఆన్‌లైన్‌ ద్వారా విక్రయాలు జరపాలని నిర్ణయించి, ఈ మేరకు 8వ తేదీన జీవో కూడా విడుదల చేసిన నేపథ్యంలో సినీ పరిశ్రమ నుంచి ముందుగా చిత్ర దర్శకుడు దేవాకట్టా స్పందించాడు. ''రైల్వే వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి వాటి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించడం సబబే. కానీ ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన సినిమాల టిక్కెట్లను ప్రభుత్వం అమ్మాలనుకోవడం కరెక్ట్‌ కాదు'' అని ఆయన పేర్కొన్నారు.

  సోషల్‌ మీడియాలో వ్యంగ్యంగా

  సోషల్‌ మీడియాలో వ్యంగ్యంగా


  ఇక మీదట సినిమాలు తీసిన నిర్మాతలు ప్రైవేట్‌ కాంట్రాక్టర్ల మాదిరి డబ్బుల కోసం ప్రభుత్వం ముందు క్యూలో నుంచోవాలేమో లేదంటే ప్రభుత్వమే సినిమాల నిర్మాణం కోసం బడ్జెట్‌ కేటాయిస్తుందా?'' అంటూ సోషల్‌ మీడియాలో వ్యంగ్యంగా కూడా ఆయన ప్రశ్నించారు. ఇక ఈ అంశం గురించి ఆయన కాకుండా మరెవరూ స్పందించిన దాఖలాలు లేక పోగా ఇప్పుడు తమిళ హీరో విశాల్ స్పందన కూడా ఆసక్తికరంగా మారింది.

  జగన్ మోహన్ రెడ్డి గారికి హ్యాట్సాఫ్

  జగన్ మోహన్ రెడ్డి గారికి హ్యాట్సాఫ్

  ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లలో ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్‌ను అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి హ్యాట్సాఫ్, మేము తమిళనాడులో కూడా అమలు చేయాలనుకుంటున్నాము, కాబట్టి ఇది జరగడం సంతోషంగా ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ స్వాగతించాలి. ఇది 100% పారదర్శకతను ఇస్తుంది అని విశాల్ పేర్కొన్నాడు.

  తమిళనాడు

  తమిళనాడు

  ఫిల్మ్ ఇండస్ట్రీ & గవర్నమెంట్‌కి ఒక వరంలా ఉండే థియేటర్ కలెక్షన్లలో పూర్తి పారదర్శకతను తీసుకురావడానికి మన రాష్ట్రంలో అమలు చేయాలని మన తమిళనాడు ముఖ్యమంత్రి తిరు M.K స్టాలిన్ సర్ ని మనస్ఫూర్తిగా కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. అయితే త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ విశాల్ అభ్య‌ర్థ‌న‌ను ప‌ట్టించుకుని ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని అమ‌లులోకి తెస్తారా? అంటే కాలమే సమాధానం చెప్పాలి.

  వరుస సినిమాలు

  వరుస సినిమాలు

  ప్ర‌స్తుతం విశాల్ ఎనిమి సినిమాతో ద‌స‌రాకు సంద‌డి చేయ‌బోతున్నాడు. ఆయన కెరీర్‌లో 31వ మూవీగా రూపొందుతోన్న సామాన్యుడు. "నాట్ ఎ కామన్ మ్యాన్" సినిమాతో శరవణన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (VFF) బ్యానర్‌పై విశాల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విశాల్ పుట్టిన‌రోజు సందర్భంగా విడుద‌ల చేసిన సామ‌న్యుడు టైటిల్ మ‌రియు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా నిన్న వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెకండ్‌ లుక్‌ని సైతం రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఇవి రెండే కాకుండా చాలా సినిమాలను షూటింగ్‌ల‌కు సిద్ధం చేశాడు.

  English summary
  Vishal Praises Ap Cm Jagan over the cinema tickets issue and Requested Stalin to implement it in a tweet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X