అనిశారెడ్డి ప్రేమలో అలా పడ్డా.. ఆమె ఇంట్లో పెంపుడు పులి, చూసి వణికిపోయా.. విశాల్
తమిళ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో అఫైర్ వార్తల నేపథ్యంలో హీరో విశాల్ ఒక్కసారిగా అభిమానులకు షాకిచ్చాడు. అర్జున్ రెడ్డి ఫేం అనిషా రెడ్డి ఆళ్లతో నిశ్చితార్థం జరిగిందనే వార్తను బయటపెట్టి దక్షిణాది సినీ పరిశ్రమను షాక్ గురిచేశాడు. త్వరలోనే అనిషాతో పెళ్లి జరిగే అవకాశం ఉంది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. అనిశాతో ప్రేమలో ఎలా పడ్డాననే విషయాన్ని వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే..

వీధికుక్కలపై సినిమా గురించి
అనిశారెడ్డి ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో కలిశాను. వీధికుక్కలపై సినిమా తీయాలని ఆమెకు కథను చెప్పాను. ఆమె ఫీడ్‌బ్యాక్ కోసం మాట్లాడినప్పుడు పరిచయం పెరిగింది. సినిమా కథపై చర్చల సందర్భంగా మా ఆలోచనలు కలిశాయి. ఆ తర్వాత మరింత దగ్గరయ్యాం అని విశాల్ చెప్పారు.

అలా ప్రేమలో పడ్డాను
అనిషా పరిచయం స్నేహంగా బలపడింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని పెద్దలను ఒప్పించడంతో మా బంధం పెళ్లికి దారి తీసింది. నేనే మొదటిసారి ప్రపొజ్ చేశాను. దేవుడు ఆమెను నా కోసమే పంపాడు అని అనిశా గురించి విశాల్ చెప్పాడు.

అనిశారెడ్డి గురించి వివరంగా
అనిషారెడ్డి వాస్తవానికి జాతీయ స్థాయిలో బాస్కెట్‌బాల్ ప్లేయర్. అంతేకాకుండా సామాజిక కార్యకర్త. పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగాలనే విషయాన్ని ఆమెకే వదిలేశాను. సామాజిక సేవ చేయడమా? సినిమాలను ప్రొఫెషన్‌గా ఎంచుకోవడం ఆమె ఇష్టానికే వదిలేశాను అని విశాల్ చెప్పాడు.

అనిశా పెంపుడు పులిని చూసి
అనిశారెడ్డి గురించి ప్రపంచానికి తెలియని ఓ సీక్రెట్‌ను బయటపెట్టారు. అనిశాకు పెంపుడు పులి ఉంది. దానిని పెంచుకొన్నది. అది తెలిసి నాకు రాత్రి నిద్రపట్టలేదు. ఆ పులిని మొదటిసారి చూసినప్పుడు చూసి షాక్ గురయ్యాను అని అనిశా అలవాట్లను, అభిరుచులను విశాల్ చెప్పాడు.


Click it and Unblock the Notifications











