విశాల్ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది!
హీరో విశాల్ తరచుగా వార్తల్లో ఉండే వ్యక్తి. విశాల్ సినిమాల పరంగానే కాక తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తుంటాడు. విశాల్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం విశాల్ సీనియర్ నటి ఖుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ఖుష్బూనే నిర్మాత. ఈ చిత్రం తర్వాత విశాల్ నటించే తదుపరి ప్రాజెక్ట్ పై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
విశాల్, సమంత జంటగా నటించిన ఇరుంబు తీరాయ్ చిత్రం గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. తెలుగులో ఈ చిత్రాన్ని అభిమన్యుడు పేరుతో అనువాదం చేసి విడుదల చేశారు. రెండు భాషల్లో అభిమన్యుడు చిత్రం మంచి విజయం సాధించింది. పీఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. విశాల్ ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పూర్తి కాగానే అభిమన్యుడు 2 ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అభిమన్యుడు 2కి మిత్రన్ కాకుండా ఆనంద్ దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా విశాల్ కు, హైదరాబాద్ కు చెందిన అనీషా అనే యువతికి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో విశాల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











