మంచు విష్ణు ఫ్యామిలీ టైమ్.. అంతా ఒక్కచోట చేరి..! వైరల్ పిక్
నేటితరం యంగ్ హీరోలు తమ తమ సినిమాలు, వ్యాపార కార్యకలాపాలతో బిజీగా ఉంటూనే ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నారు. భార్య, పిల్లలతో సరదాగా షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని ఇలా అందరూ ఫ్యామిలీ టైమ్ అంటూ ఓ ప్రత్యేక సమయాన్ని కేటాయించుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కోవలోనే మంచు వారబ్బాయి మంచు విష్ణు తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి సరదాగా గడిపాడు. అంతా ఒక్కచోట చేరి ఫోటోలు దిగారు.

వీటిలోంచి ఓ పిక్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది మంచు విష్ణు భార్య విరానిక. దీనిపై 'ప్రేమతో.. మై ఫ్యామిలీ' అనే క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ ఫొటోలో మంచు విష్ణు, ఆయన భార్య విరానికా, ముగ్గురు పిల్లలు అరియానా, వివియానా, అవ్‌రామ్ చాలా హుషారుగా కనిపిస్తున్నారు. ఇయాదృ కూతుళ్లు, ఓ కుమారుడితో ఈ ఫ్యామిలీ చాలా నిండుగా కనిపిస్తోంది. ఈ రోజుల్లో ఓ హీరో ముగ్గురు పిల్లలను కనడం, వారితో ఇలా సరదా షికార్లు చేయడం చూసి మురిసిపోతూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంచు విష్ణు, విరానికా దంపతులు మరో బిడ్డకు కూడా జన్మనివ్వబోతున్నారు. వీరిద్దరికీ త్వరలో నాలుగో సంతానం కలగబోతోంది. ఈ విషయాన్ని కొద్దిరోజుల క్రితం మంచు విష్ణు స్వయంగా చెప్పడంతో అంతా షాకయ్యారు. అయితే విష్ణు నాలుగో సంతానం విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ దంపతులను కుటుంబ నియంత్రణ పాటించరా? అంటూ ట్రోల్ కూడా చేస్తున్నారు.
ఇక మంచు విష్ణు సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ఓటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టలేక పోయింది. జయాపజయాలను లెక్కచేయకుండా ప్రస్తుతం ఆయన తదుపరి ప్రాజెక్టు 'కన్నప్ప' కోసం ప్రిపేర్ అవుతున్నాడు మంచు విష్ణు.


Click it and Unblock the Notifications











