భార్యకు విడాకులు ఇచ్చిన ప్రముఖ హీరో.. షాకింగ్‌లో సినీ పరిశ్రమ!
తమిళ సినీ పరిశ్రమలో సినీ హీరో జంట తన దాంపత్య జీవితానికి గుడ్‌బై చెప్పాడు. హీరో విష్ణు విశాల్ భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత భావోద్వేగమైన లేఖను రాసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తమ వ్యక్తిగత జీవితానికి భంగం కలుగకుండా చూడాలని మీడియాకు, అభిమానులకు, సన్నిహితులను వేడుకొన్నారు. ఇటీవల విడుదలైన రాట్సాసన్ చిత్రం ఘనవిజయం సాధించడంతో విష్ణు విశాల్ ఖాతాలో బ్లాక్‌బస్టర్ చేరింది. ఇలాంటి సంతోషకరమైన నేపథ్యంలో తమ హీరో భార్యకు విడాకులు ఇవ్వడం ఫ్యాన్స్‌కు షాకింగ్‌గా మారింది.

విష్ణు విశాల్ ఎమోషనల్ లేఖ
సోషల్ మీడియా వెబ్‌సైట్ ట్విట్టర్‌లో విష్ణు విశాల్ ఓ ఎమోషనల్ లేఖను పోస్టు చేశారు. నా భార్య రజనీ, నేను విడిపోయాం. అధికారికంగా విడాకులు తీసుకొన్నాం. మాకు ఓ కుమారుడు ఉన్నాడు. నా కుమారుడి సంరక్షణ మా ఇద్దరి పర్యవేక్షణలో జరుగుతుంది. నా కుమారుడి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మా ప్రైవసీకి భంగం కలిగించకూడదు అని విష్ణు విశాల్ పేర్కొన్నాడు.

స్నేహితులుగానే ఉంటాం
దాంపత్య జీవితంలో మేము విడిపోయినా వ్యక్తిగతంగా మేమిద్దరం స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకొన్నాం. నా కుమారుడే సంరక్షణనే మాకు అత్యంత ప్రాధాన్యం అని ట్వీట్‌లో విశాల్ పేర్కొన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు కలువలేని పరిస్థితుల్లో విడిపోయారని వారి సన్నిహితులు పేర్కొంటున్నారు.

కాలేజీలోనే లవ్.. వివాహం
విశాల్ భార్య రజని తమిళ నటుడు కే నటరాజ్ కుమార్తే. కాలేజీలో విశాల్‌కు ఆమె జూనియర్. కాలేజిలో చదువుతున్న సమయంలోనే వారిద్దరూ ప్రేమించుకొన్నారు. నాలుగేళ్లపాటు రిలేషన్ షిప్‌లో ఉన్న తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. 2011 డిసెంబర్‌లో విశాల్, రజనీ వివాహం చెన్నైలో జరిగింది.
కోలీవుడ్ పరిశ్రమకు షాక్
విష్ణు విశాల్, రజనీ విడిపోయారనే వార్త కోలీవుడ్ వర్గాలను షాక్ గురిచేసింది. వారి సన్నిహితులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. విష్ణు విశాల్ రాసిన ఎమోషనల్ లేఖను సినీ క్రిటిక్ శ్రీధర్ పిళ్లై షేర్ చేశాడు. విష్ణు విశాల్, రజనీ దాంపత్య జీవితానికి గుడ్‌బై చెప్పారు. వారు అధికారికంగా విడాకులు తీసుకొన్నారు. విష్ణు రాసిన లేఖ ఇదే అని శ్రీధర్ ట్వీట్ చేశాడు.

రాట్సాసన్‌తో భారీ సక్సెస్‌తో
తమిళ చిత్ర పరిశ్రమలో విష్ణు విశాల్‌కు క్రేజ్ పెరిగింది. ఆయన నటించిన రాట్సాసన్ చిత్రం అక్టోబర్ 5న రిలీజై ఘన విజయం సాధించింది. ఇటీవలే తన సినిమా విజయాన్ని ఫ్యాన్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకొన్నారు. ఈ వార్త తెలియగానే చాలా మంది సన్నిహితులు సోషల్ మీడియాలో స్పందించారు. వారి వ్యక్తిగత జీవితం బాగుండాలని కోరుకొన్నారు.


Click it and Unblock the Notifications











