For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విజయ్ దేవరకొండతో వివాదం అదే... ఆ ప్రొడ్యూసర్ వల్లే.. అసలు విషయం బయటపెట్టిన విశ్వక్సేన్

  |

  ఫలక్నామా దాస్ సినిమాతో ప్రేక్షకుల అందరికీ పరిచయం అయ్యారు విశ్వక్సేన్. అంతకు ముందు వెళ్లిపోమాకే సినిమా చేసినా ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ నగరానికి ఏమైంది సినిమాలో ఒకడిగా నటించినా ఆశించిన మేర గుర్తింపు దక్కలేదు. కానీ మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అంగామలై డైరీస్ సినిమా హక్కులు కొని తెలుగులో తానే దర్శకత్వం వహించి హీరోగా నటించి రిలీజ్ చేయడంతో ఆ సినిమా సూపర్ హిట్ అయింది.

  ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. నాని నిర్మించి, శైలేష్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన హిట్ సినిమాలోనూ హీరోగా నటించి విశ్వక్సేన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఫలక్నామ దాస్ విడుదల సమయంలో విజయ్ దేవరకొండతో వివాదం ఏర్పడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. తాజాగా ఆలీతో సరదాగా అనే ఒక టాక్ షోలో పాల్గొన్న విశ్వక్సేన్ దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

  ప్రమోషన్స్ లో భాగంగా

  ప్రమోషన్స్ లో భాగంగా

  యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్సేన్ ప్రస్తుతం పాగల్ అనే సినిమా చేశారు. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూసివేసిన నేపథ్యంలో ఈ సినిమా కూడా రిలీజ్ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుందని భావించి ముందే ఆయన కొన్ని టీవీషోలలో ప్రమోషన్స్ నిర్వహించారు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోకి ఇప్పటికే ఆయన అతిథిగా హాజరయ్యారు. అలాగే తాజాగా ఆలీతో సరదాగా షోకి కూడా ఆయన గెస్టుగా హాజరయ్యారు.

  విజయ్ తో వివాదం

  విజయ్ తో వివాదం

  ఈ టాక్ షోలో ఆలీతో సరదాగా మాట్లాడుతూ ఆయన అనేక విషయాలు పంచుకున్నారు. అసలు తాను ఎవరు ఇండస్ట్రీకి ఎలా వచ్చాను ? తనకు అండగా ఎవరు నిలబడ్డారు అనే అనేక ఆసక్తికరమైన అంశాలను ఆయన అలీతో పంచుకున్నారు. తన నేపథ్యం సినిమాల్లోకి రావడానికి తనకు స్ఫూర్తి ఎవరు అనే విషయాలను కూడా విశ్వక్సేన్ ఆలీతో పంచుకున్నారు. ఇదే సమయంలో ఆలీ ఈ వివాదం గురించి విశ్వక్సేన్ ని ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం గురించి ఆయన స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

  అసలు ఆరోజు ఏమి జరిగింది అంటే

  అసలు ఆరోజు ఏమి జరిగింది అంటే

  తన ఫలక్నామ దాస్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు తాను విజయోత్సవ యాత్రలో భాగంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తున్నానని విశ్వక్సేన్ చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలో హైదరాబాదులో తన సినిమా ఆడుతున్న థియేటర్లలో కొన్ని చోట్ల సినిమా పోస్టర్లు చెబుతున్నట్లుగా ఉన్న కొన్ని వీడియోలు ఫోటోలు తనకు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చాడు. కష్టపడి సినిమా తీసి సొంతంగా డబ్బులు పెట్టి ఇంతలా కష్టపడుతుంటే ఇలా ఎందుకు చేస్తున్నారని ఆవేదనతో ఇంస్టాగ్రామ్ లైవ్ లో చిన్న వార్నింగ్ లాంటిది ఇచ్చానని ఆయన అన్నాడు. అయితే ఇది ఎవరినీ ఉద్దేశించి చేయలేదని, కానీ కొందరు విజయ్ దేవరకొండ కు లింక్ చేశారని చెప్పుకొచ్చాడు.

  అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నా

  అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నా

  అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నా నేను ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఆరోజు ఆవేదనతో మాత్రమే నేను నేను పోస్టర్ లు చంపిన వారిని తిట్టడం అని ఒక హీరోని గాని లేదా హీరో అభిమానులను ఉద్దేశించి తాను ఆ కామెంట్స్ చేయలేదని విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు. కానీ విజయ్ దేవరకొండతో లింక్ చేసి కొందరు వార్తలు రాశారని అన్నారు. దీంతో తనకు విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉందని చాలా మంది భావించాలని ఆయన చెప్పుకొచ్చాడు. తమ మధ్య ఎలాంటి వివాదం లేదని విశ్వక్సేన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

  Adivi Sesh To Play AP Police Officer In HIT 2 | Nani | Vishwak Sen
  ఆ ప్రొడ్యూసర్ అలా అనడంతో

  ఆ ప్రొడ్యూసర్ అలా అనడంతో

  అలాగే ఫలక్నామ దాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నన్ను ఎవరూ లేపలేదు నన్ను నేనే లేపుకుంటా అనే వ్యాఖ్యల మీద కూడా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వస్తున్న సమయంలో ఒక ప్రొడ్యూసర్ అన్నట్లుగా కొన్ని మాటలు తన చెవిన పడ్డాయి అని ఆ మాటలు తనను ఎంతో బాధించిందని చెప్పుకొచ్చాడు.. ఒకడిని ఇలాగే లేపితే ఇప్పుడు మన నెత్తికెక్కి కూర్చున్నాడు వీడిని కూడా లేపొద్దు అంటూ ఒక ప్రొడ్యూసర్ తన గురించి కామెంట్ చేసినట్లు తెలియడంతో అవే మాటలు తన చెవిలో మారుమ్రోగాయని చెప్పుకొచ్చారు. ఆ ప్రొడ్యూసర్ ని ఉద్దేశిస్తూ తాను మాట్లాడే అనే తప్ప వేరే ఎవరిని కించపరచాలని లేదా మరో హీరోని ఏదో అనాలని కాదు అని చెప్పుకొచ్చాడు.

  English summary
  Young actor Vishwak Sen in his recent interview responded about the issue with vijay devarakonda. he clarifies about the issue happened at the time of falaknuma das.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X