Das Ka Dhamki Trailer 2.0: మరోసారి బూతులతో వార్నింగ్ ఇచ్చిన విశ్వక్.. హై యాక్షన్ డోస్!

యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం దమ్కీ. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని నిర్మాత కూడా విశ్వక్ సేన్ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మూవీ ఫస్ట్ ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై కొంత వరకు అంచనాలు ఉన్నాయి. నివేతా పేతురాజ్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా దమ్కీ నుంచి ట్రైలర్ 2.0 ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ ట్రైలర్ లో అటు ఫన్, ఇటు యాక్షన్ అండ్ లవ్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసి చూపించరు. సంజయ్ రుద్ర అనే క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ ఎంట్రీతో ట్రైలర్ ని స్టార్ట్ చేశారు. ఫార్మసీ ఇండస్ట్రీ అధినేత అయిన సంజయ్ రుద్ర క్యాన్సర్ ఫ్రీ కంట్రీ ఒక మిరాకిల్ మెడిసన్ తయారు చేస్తాడు. ఇక సెకండ్ క్యారెక్టర్ లో వెయిటర్ అయిన విశ్వక్ సేన్ హీరోయిన్ ని పడేయడానికి డబ్బున్నవాడిలా నటిస్తూ ఆమెకి అబద్దాలు చెబుతూ ఉంటాడు. అతన్ని కోటీశ్వరుడిగా భావించిన హీరోయిన్ ప్రేమలో పడిపోతుంది.

Vishwak sen das ka dhamki trailer 2.0 talk and release details

తరువాత అనుకోని ప్రమాదంలో సంజయ్ రుద్ర చనిపోతాడు. అతని ప్లేస్ లోకి వెయిటర్ అయిన విశ్వక్ సేన్ వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత అతను ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు. సంజయ్ రుద్ర మరణానికి కారణం ఎవరు. అతని క్యాన్సర్ ఫ్రీ కంట్రీ కాన్సెప్ట్ ని విలన్ గా ఉన్నవారిని గుర్తించి అతని ఆశయం నేరవేర్చాడా లేదంటే బ్రతకడానికి డబ్బు లేకపోయిన పర్వాలేదు కాని డబ్బున్నవాడిగా చనిపోవాలి అనే వెయిటర్ విశ్వక్ సేన్ ఆలోచనకి తగ్గట్లుగా కోటీశ్వరుడిగా మారి తన డ్రీమ్ నెరవేర్చుకున్నాడా అనే ఎలిమెంట్స్ కథలో భాగంగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తూ ఉంటే తెలుస్తుంది.

ఓ వైపు ఫన్ ని నడిపిస్తూనే మరో వైపు యాక్షన్ ఎలిమెంట్స్ ని కూడా విశ్వక్ సేన్ కరెక్ట్ గా ప్రెజెంట్ చేసాడని ట్రైలర్ బట్టి అర్ధం అవుతుంది. స్టొరీ బేస్ లైన్ రెగ్యులర్ గా ఉన్న కూడా కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. విశ్వక్ సేన్ కెరియర్ లో పంక్తు కమర్షియల్ ఫార్మాట్ లో వస్తున్న మూవీగా దమ్కీ ఉందని ట్రైలర్ తోనే క్లారిటీ వస్తుంది. మరి థియేటర్స్ లో ఈ మూవీ ఏ మేరకు బ్లాక్ బస్టర్ అందుకుంటుంది అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X